RC15: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ సౌత్ టాప్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. “RRR” బ్లాక్ బస్టర్ తో మంచి జోరు మీద ఉన్న రామ్ చరణ్… శంకర్ సినిమా షూటింగ్ త్వరగా కంప్లీట్ చేసే దిశగా చురుకుగా పనిచేస్తున్నారు. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కమెడియన్ సునీల్ కూడా నటిస్తున్నారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఈ సందర్భంగా ఇటీవల ఈ సినిమా లో తన పాత్ర గురించి సునీల్ కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమా మొత్తం చరణ్ పక్కన తన పాత్ర ఉంటుందని తెలియజేశారు. అసలు నా కెరీర్ లో ఇటువంటి క్యారెక్టర్ ఎప్పుడూ చేయలేదు. కచ్చితంగా సినిమా చూశాక చాలా రోజులు… నా పాత్ర గురించి డిస్కషన్స్ పెట్టుకుంటారు అని సునీల్ ఇంటర్వ్యూలో తెలిపాడు. డైరెక్టర్ శంకర్ చాలా డిఫరెంట్ గా నా పాత్ర క్రియేట్ చేశారు. నా కెరియర్ లో.. శంకర్ సినిమాలో చేసే పాత్ర చిరస్థాయిగా నిలిచిపోతుందని స్పష్టం చేశారు.
సునీల్ ప్రస్తుతం పూర్తిస్థాయి కామెడీ పాత్రలు చేస్తు గత వైభవాన్ని పొందే రీతిలో రాణిస్తున్నారు. ప్రారంభంలో కామెడీ పాత్రలు చేయగా తర్వాత.. సునీల్ హీరోగా ఓ ప్రయోగం చేయడం విఫలం కావడం తెలిసిందే. అయితే ఇప్పుడు మళ్లీ గతంలో వదిలేసిన కమెడియన్ ప్లేస్ కి చేరుకునే దిశగా … కామెడీ పాత్ర లకు సంబంధించి ప్రతి అవకాశాన్ని అందుకుంటూ సునీల్ రాణిస్తున్నాడు. ఈ క్రమంలో శంకర్ సినిమాలో చేసే పాత్ర హైలెట్ గా ఉంటుందని రీసెంట్ ఇంటర్వ్యూ లో సునీల్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వైజాగ్ పరిసర ప్రాంతాలలో జరుగుతోంది.