సినిమా

Sunny Leone: వంట‌ల‌క్క‌గా మారిన సన్నీ లియోన్.. విష్ణు కోసం కిచెన్‌లో కుస్తీలు!

Share

Sunny Leone: సన్నీ లియోన్.. ఈ పేరు తెలియ‌ని వారుండ‌రు. ఒక‌ప్పుడు నీలి చిత్రాల ద్వారా దేశ‌వ్యాప్తంగా పాపుల‌ర్ అయిన ఈ బ్యూటీ.. ఆ త‌ర్వాత బాలీవుడ్‌లో న‌టిగా సెటిల్ అయింది. ప్ర‌స్తుతం నార్త్‌తో పాటు సౌత్‌లోనూ సినిమాలు చేస్తున్న స‌న్నీ.. త్వ‌ర‌లోనే మంచు విష్ణు సినిమాతో టాలీవుడ్‌లో సంద‌డి చేసేందుకు సిద్ధం అవుతోంది.

షాన్‌ సూర్య దర్శకత్వంలో మంచు విష్ణు ఓ సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. అవ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై నిర్మిత‌మ‌వుతున్న‌ ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ స్వ‌రాలు స‌మ‌కూర్చుతుండ‌గా, కోన వెంకట్ కథ, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. అలాగే ఇందులో పాయ‌ల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. స‌న్నీ లియోన్ ఓ ముఖ్య‌మైన పాత్ర‌ను పోషిస్తోంది.

ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ హైద‌రాబాద్‌లో జ‌రుగుతోంది. అయితే షూట్ నుంచి గ్యాప్ దొరికిందంటే చాలు.. స‌న్నీలియ‌న్‌, మంచు విష్ణు క‌లిసి ఏదో ఒక ఫ‌న్నీ వీడియోను చేస్తూ నెటిజ‌న్ల‌ను ఆక‌ట్టుకుంటున్నారు. ఇక తాజాగా స‌న్నీ లియోన్ విష్ణు కోసం వంట‌ల‌క్క‌గా మారి కిచెన్‌లో కుస్తీలు ప‌డింది. అవును, స‌న్నీ స్వ‌యంగా త‌న చేతుల‌తో పరోటాలు చేసి విష్ణుకు రుచి చూపించింది.

ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఈ వీడియోలో అచ్చ తెలుగు ఆడపడుచులా లంగా ఓణి, జడ వేసుకొని సన్నీ వంట చేసింది. ఇక ఆమె పరోటాలు చేస్తుంటే విష్ణు పక్కనే ఉండి ఆటపట్టించడం, సన్నీకి తెలుగు నేర్పించడం, విష్ణు అన్నమాటలను ఇంగ్లీష్ యాసలో అమ్మడు పలకడం ఎంతో సరదాగా అనిపిస్తాయి. మ‌రి ఇంకెందుకు ఆ వీడియోపై మీరు ఓ లుక్కేసేయండి.


Share

Related posts

RC15: దిల్ రాజు ఇచ్చిన సాలీడ్ అప్‌డేట్‌తో ఇక ఆర్ఆర్ఆర్ మూవీ గురించి పట్టించుకోరేమో..

GRK

Bheemla nayak: ప్రివ్యూ చూసిన పవన్ ఇలా రియాక్ట్ అవుతారని ఎవరూ ఊహించలేదట..

GRK

Katrina Kaif Latest Gallerys

Gallery Desk