Sunny Leone: సన్నీలియోన్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. ఒకప్పుడు శృంగార తారగా ఆన్ లైన్ మాధ్యమాలను షేక్ చేసిన ఈ అందాల భామ.. ప్రస్తుతం బాలీవుడ్లో నటిగా సెటిల్ అయింది. అలాగే సౌత్‌లోనూ సినిమాలు చేస్తున్న సన్నీలియోన్ త్వరలోనే టాలీవుడ్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతోంది. తాజాగా మంచు విష్ణు సన్నీకి బంపర్ ఆఫర్ ఇచ్చారు.
గత కొంత కాలం నుంచీ వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్న ఆయన.. ఇటీవలె ఓ సినిమాను స్టార్ట్ చేశాడు. ఈషాన్ సూర్య డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని అవ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇందులో గాలి నాగేశ్వరరావు అనే డిఫరెంట్ పాత్రలో విష్ణు కనిపించబోతుండగా.. ఆయన సరసన హాట్ బ్యూటీ పాయల్ రాజ్‌పూత్ హీరోయిన్గా కనిపించబోతోంది.
అయితే మరో ముఖ్యమైన పాత్రలో సన్నీలియన్ నటిస్తోంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఆమె స్వయంగా తెలిపింది. `రేణుక అనే పాత్రలో నేను కనిపించబోతున్నా. ఈ రోజు మరో జర్నీని మంచు విష్ణుతో కలిసి ప్రారంభించినందుకు చాలా థ్రిల్లింగ్ ఉంది` అంటూ సన్నీ ఇన్స్టాగ్రామ్ ద్వారా రాసుకొచ్చింది.
అలాగే తన పాత్రకు సంబంధించిన స్కెచ్ ని కూడా పోస్ట్ చేసింది. దీంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. కాగా, మంచు మనోజ్ నటించిన `కరెంటు తీగ` సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన సన్నీ లియోన్.. మళ్లీ ఇన్నేళ్లకు విష్ణుతో రొమాన్స్‌కు రెడీ అయింది. దీంతో ఆమె ఫ్యాన్స్ ఫుల్ హంగామా చేస్తున్నారు. అంతేకాదు, ఆమెను ఎప్పుడెప్పుడు తెరపై చూడాలా అని ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
https://www.instagram.com/p/CaymZjpjce_/?utm_source=ig_web_copy_link