Sunny Leone: సన్నీ లియోన్.. ఈ పేరుకు కొత్తగా పరిచయాలు అవసరం లేదు. నీలి చిత్రాల ద్వారా వరల్డ్ వైడ్‌గా ఫేమస్ అయిన సన్నీ.. ఆ తర్వాత బాలీవుడ్లో నటిగా సెటిల్ అయింది. సౌత్‌లోనూ అడపా తడపా సినిమాలు చేస్తున్న ఈ హాట్ బ్యూటీ.. లాంగ్ గ్యాప్ తర్వాత టాలీవుడ్లోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. మంచు మనోజ్ హీరోగా తెరకెక్కిన `కరెంట్ తీగ` సినిమాతో సన్నీ టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది.
ఆ తర్వాత `గరుడవేగ`లో ఐటెం సాంగ్ చేసింది. అయితే మళ్లీ ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. మంచు విష్ణు ప్రస్తుతం ఇషాన్ దర్శకత్వంలో ఒక కొత్త చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో గాలి నాగేశ్వరరావు పాత్రలో మంచు విష్ణు కనిపించబోతుండగా.. స్వాతి అనే రోల్లో పాయల్ రాజ్‌పూత్ నటిస్తోంది.
అలాగే ఇందులో రేణుక అనే మరో ముఖ్యమైన పాత్ర కూడా ఉంది. దానిని సన్నీ లియోన్ చేస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే ఈ సినిమాకు సన్నీ లియోన్ అందుకుంటున్న రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం.. సన్నీ ఈ చిత్రం కోసం ఇరవై రోజుల కాల్షీట్లు ఇచ్చిందట.
అందుకుగానూ ఆమె ఏకంగా రూ. 2.5 కోట్లు పుచ్చుకుంటుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా ఇరవై రోజులకు రెండున్నర కోట్లంటే మామూలు విషయం కాదనే చెప్పాలి. కాగా, అవ ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఫేమస్ రైటర్ కోన వెంకట్ మాటలు స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. మరియు ఆయన సహా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు.