Salaar: భారతీయ చలనచిత్ర రంగంలో అనేక రికార్డులు బ్రేక్ చేసిన “బాహుబలి” తో ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగిపోవడం తెలిసిందే. అయితే “బాహుబలి” తర్వాత ప్రభాస్ ఆ స్థాయిలో విజయం సాధించలేకపోయారు. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన సాహూ, రాధేశ్యాం, ఆది పురుష్ మూడు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ఇటువంటి పరిస్థితులలో కేజిఎఫ్ దర్శకుడుతో సలార్ అనే సినిమా ప్రభాస్ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కాబోతోంది. మొదటి భాగాన్ని ఈనెల అనగా సెప్టెంబర్ 28వ తారీకు విడుదల చేస్తున్నట్లు అధికారికంగా తేదీ ప్రకటించడం జరిగింది. కానీ ఇప్పుడు సినిమా అనుకున్న సమయాన్ని కంటే కాస్త ఆలస్యంగా విడుదల కాబోతున్నట్లు వార్తలు రావడం జరిగాయి. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ పూర్తి నిరాశ లోకి వెళ్లిపోయారు.

మొన్ననే దారుణమైన “ఆది పురుష్” అట్టర్ ఫ్లాప్ కావటం ఇప్పుడు..”సలార్” వాయిదా పడటం వార్తలుపై నిరాశ చెందుతున్నారట. అయితే సినిమా విడుదల వాయిదాకి కారణం.. పోస్ట్ ప్రొడక్షన్, విఎఫ్ ఎక్స్ విషయంలో ప్రశాంత్ నీల్ సంతృప్తికరంగా లేరట. అసలే ఈ సినిమాలో కేజిఎఫ్ లో ఉండే యాక్షన్స్ సన్నివేశాలు కంటే ఎక్కువ ఉండబోతున్నాయట. మొదటి నుండి ఈ సినిమాలో 1000 మందితో ప్రభాస్ ఫైట్ చేయబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకి సంబంధించి విజువల్, విఎఫ్ ఎక్స్ వర్క్ రోబో2.9 చిత్రానికి పనిచేసిన..టీంకు “సలార్” గ్రాఫిక్స్ వర్క్ ఇవ్వటం జరిగింది అంట. అయితే ఇప్పుడు సెప్టెంబర్ 28వ తారీకుకి బెస్ట్ ఔట్ పుట్ ఇవ్వటం కష్టమని అంటున్నారట. “సలార్” యుద్ధాలు లాంటి యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయట.

సో అలాంటప్పుడు గ్రాఫిక్స్ వర్క్ అనేది పెద్ద పాత్ర పోషిస్తుంది. దీంతో డైరెక్టర్ ప్రశాంత్ నిల్ కాస్త టైం తీసుకున్న పర్వాలేదు కాని బెస్ట్ ఔట్ పుట్ ఇస్తే చాలు అని.. సూచించారట. దీంతో సెప్టెంబర్ 28వ తారీకు విడుదల కావలసిన “సలార్” వాయిదా పడినట్లు టాక్. ఇదే సమయంలో సినిమా రిలీజ్ వాయిదా వేస్తున్నట్లు అధికారికంగా మూవీ యూనిట్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.

సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై చిత్ర యూనిట్స్ స్పందించలేదు. అలాగే ట్రైలర్ అప్ డేట్ కూడా ఇంకా ఇవ్వలేదు. సో దీన్ని బట్టి చూస్తే “సలార్” పోస్ట్ పోన్ ఖాయం అనే మాట వినిపిస్తుంది. అయితే ఈ ఏడాది చివరిలో లేదా సంక్రాంతి పండుగకు విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా సినిమాకి గ్రాఫిక్స్ వర్క్ మేం కావడంతో అభిమానులకు నచ్చే విధంగానే ఉండే రీతిలో ప్రశాంత్ నీల్ “సలార్” ఔట్ పుట్ విషయంలో చాలా జాగ్రత్తలు పడుతున్నారట. పైగా రెండు భాగాలుగా వస్తూ ఉండటంతో మొదటి భాగం విషయంలో.. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావటం లేదాట.