Sukumar Prabhas: పాన్ ఇండియా ఇమేజ్ వచ్చిన తర్వాత ప్రభాస్ తో సినిమా చేయడానికి అనేక మంది దర్శకులు పోటీపడుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ మొదలుకొని దక్షిణాది సినిమా వరకు చాలామంది దర్శకులు డార్లింగ్ ప్రభాస్ తో సినిమా చేయడానికి ఎదురుచూస్తున్నారు. “బాహుబలి 2” విజయం తర్వాత ప్రభాస్ ఇమేజ్ నేషనల్ ఇంటర్నేషనల్ రేంజ్ కి పెరిగిపోయింది. ప్రభాస్ తో సినిమా చేసి ఒక హిట్టు పడితే చాలు… తమ దశ మారిపోతుందని చాలామంది అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు.
అయితే ఇలాంటి తరుణంలో టాలీవుడ్ టాప్ డైరెక్టర్ లలో ఒకరు సుకుమార్ కి ప్రభాస్ తో సినిమా చేసే అవకాశం వచ్చినట్లు సరికొత్త వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది. వాస్తవానికి డైరెక్టర్ సుకుమార్ తన మొదటి సినిమా “ఆర్య” ప్రభాస్ తో చేయాలని స్టోరీ చెప్పడం జరిగిందట. అయితే స్టోరీ మొత్తం విని తనకి ఈ సినిమా సూట్ కాదని ప్రభాస్ రిజెక్ట్ చేశారట. ఇక అదే సినిమాని అల్లు అర్జున్ చేయడంతో అతనికి మొదటి హిట్ పడింది. “ఆర్య” సినిమాతో అల్లు అర్జున్ ఇమేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఇక సుకుమార్ రేంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. “పుష్ప”తో సుకుమార్ మార్కెట్ పాన్ ఇండియా రేంజిలో అమాంతం పెరిగిపోయింది.
ప్రస్తుతం ప్రభాస్ నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ నాలుగు కంప్లీట్ అయిన వెంటనే సుకుమార్ తో పాన్ ఇండియా నేపథ్యంలో సినిమా చేయనున్నట్లు ఇండస్ట్రీలో వార్త వైరల్ అవుతుంది. ఇక సుకుమార్ ప్రస్తుతం “పుష్ప 2” పై ఫోకస్ పెట్టడం జరిగింది. వచ్చే ఏడాది ఈ సినిమా రిలీజ్ చేయనున్నారు. ఆ తర్వాత విజయ్ దేవరకొండ ప్రాజెక్ట్ మొదలుకానున్నట్లు సమాచారం. ఏదైనా వెంటనే ప్రభాస్ సినిమా సుకుమార్ చేసే అవకాశాలున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.