Krishna-Mahesh: టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. సూపర్ స్టార్ కృష్ణ తనయుడిగా సినీ ఇండిస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ.. మహేశ్ తనదైన టాలెంట్‌తో ఒక్కో మెట్టు ఎక్కుతూ టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరిగా స్థానాన్ని సంపాదించుకున్నాడు. అదే సమయంలో తండ్రికి తగ్గ తనయుడిగా ముద్ర వేయించుకున్నాడు.
ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతున్న మహేశ్ గురించి ఆయన తండ్రి కృష్ణ ఓ ఆసక్తికర విషయాన్ని బయట పెట్టారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మే 31న సూపర్ స్టార్ కృష్ణ ఘట్టమనేని పుట్టినరోజు. ఈ సందర్భంగా తన కుమార్తె మంజుల స్టార్ట్ చేసిన యూట్యూబ్ ఛానెల్‌కు కృష్ణ ఇంటర్వ్యూ ఇచ్చారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఈ సందర్భంగా తన సినీ జర్నీ గురించి, ఫ్యామిలీ గురించి ఎన్నో విషయాలను షేర్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే మహేశ్ ను తొలిసారి నటిస్తావా అని అడిగినప్పుడు అతడి రియాక్షన్ ఏంటో కూడా తెలియజేశారు. “ఒకసారి షూటింగ్ చూడటానికి స్టూడియోకి మహేశ్ వచ్చాడు. షూటింగ్ జరుగుతుంటే… దూరంగా మెట్ల మీద కూర్చున్నాడు. నేను అతడి దగ్గరకు వెళ్లి `యాక్ట్ చేస్తావా?`అని అడిగితే… `నేను చేయను నేను చేయను` అంటూ స్టూడియో అంతా పరుగులు పెట్టాడు.` అని కృష్ణ చెప్పుకొచ్చారు.
ఇక మంజుల అందం గురించి అడగగా.. ఆయన గాడ్స్ గిఫ్ట్ అంటూ సమాధానం ఇచ్చారు. అలాగే ఎప్పుడూ తాను ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటానని, పని లేకుండా బయటకు వెళ్లనని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు, తాను సినిమా హీరోను కావాలని ఏ ఉద్యోగం చేయలేదని కూడా కృష్ణ చెప్పుకొచ్చారు. దీంతో ఆయన కామెంట్స్ కాస్త నెట్టింట వైరల్‌గా మారాయి.