Mahesh Babu: సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోలు రకరకాల క్లారిటీ కార్యక్రమాలు చేస్తుంటారు. తెలుగు చలనచిత్ర రంగంలో ఈ రకంగా మహేష్ బాబు ఎక్కువ చేస్తూ ఉంటారు. ఆయన చేసే కార్యక్రమాలు సైతం చాలావరకు చాలామందిని ప్రభావితం చేస్తూ ఉంటాయి. చిన్నపిల్లలకు ఉచితంగా హార్ట్ ఆపరేషన్స్ ఇంకా రకరకాల.. కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. అంతేకాదు కొన్ని గ్రామాలను కూడా ఆయన దత్తత తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన ఊరు బుర్రె పాలెం మహేష్ దత్తత తీసుకుని అక్కడ రోడ్లు అనేక మౌలిక సదుపాయాలు సొంత ఖర్చుతో అందించారు. తన ఫౌండేషన్ ద్వారా ఎన్నో సమాజానికి మంచి పనులు చేయడం జరిగింది.
ఇప్పుడు అదే మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా విద్యారంగంలో బాగా చదువుకునే పేద విద్యార్థులకు తన వంతు సాయం అందించడానికి మహేష్ రెడీ కావడం జరిగింది అంట. విషయంలోకి వెళ్తే ఇటీవల సూపర్ స్టార్ కృష్ణ మొదటి వర్ధంతి సందర్భంగా మహేష్ మరియు నమ్రత మీడియా ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా నమ్రత మాట్లాడుతూ మామయ్య గారి వర్ధంతి సందర్భంగా ఆయన పేరు మీద ఒక స్కాలర్ షిప్ ప్రారంభించబోతున్నాం. ఇప్పటికే నలుగురు చురుకైన విద్యార్థులను ఎంపిక చేసాం. వారిని చదివించే బాధ్యతను ఫౌండేషన్ చూసుకుంటుంది. వారి చదువు పూర్తి అయ్యేవరకు మాదే బాధ్యత.
ఈ స్కాలర్ షిప్ కోసం ఎంపిక చేసే విద్యార్థులు కచ్చితంగా పేద విద్యార్థులే అయ్యుంటారు. వారి చదువుకు సంబంధించి పూర్తి ఖర్చు మహేష్ బాబు ఫౌండేషన్ చూసుకుంటుంది. ఇటువంటి మంచి కార్యక్రమంలో మామయ్య ఆశీస్సులు మాకు ఉంటాయని ఆకాంక్షిస్తున్నాం” అని నమ్రత స్పష్టం చేశారు. ప్రస్తుతం మహేష్ త్రివిక్రమ్ దర్శకత్వంలో “గుంటూరు కారం” సినిమా చేస్తున్నారు. ఈ సినిమా జనవరిలో సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది.