మహర్షి విషయంలో ఏం జరుగుతోంది?

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘మహర్షి’. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 25 విడుదల చేయాలని చాలా రోజుల క్రితమే డిసైడ్ చేశారు.ముందుగా అనుకున్నట్టు ఈ సినిమా ఏప్రిల్‌లో విడుదల కావాలి కానీ..ఈ సినిమా ఔట్‌పుట్ మీద మహేష్ బాబు అసంతృప్తిగా ఉన్నారని, అందుకే ఈ చిత్రంలోని కొన్ని సీన్లు రీ షూట్ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.

ఈ సినిమా మహేష్ బాబు కెరీర్ లో 25వ కావడం.మహేష్ బాబు గత చిత్రం ‘భరత్ అనే నేను’ బాక్సాఫీసు వద్ద సంచలన విజయం అందుకుంది. సుమారు 200 కోట్లకుపైగా వసూలు చేసింది. అలాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమా అందుకే ఈ సినిమా మీద మహేష్ బాబు స్పెషల్ కేర్ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది.సినిమాలో కొన్ని చోట్ల భావోద్వేగాలు మిస్సయినట్లు భావిస్తున్న మహేష్ రీ షూట్ చేయాలని కోరినట్లు టాక్.మహేష్ బాబు నిర్ణయంతో నిర్మాతలు అశ్వినీదత్, దిల్ రాజు కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. ఈ చిత్రంలో మహేష్ సరసన పూజా హెగ్డే నటిస్తుండగా, అల్లరి నరేష్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇవన్నీ కుదిరితే ఈ సినిమాను జూన్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.చూడాలి మరి రీషూట్స్ తరువాత అయినా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో లేదో..