సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన సినిమా వస్తుదంటే చాలు అభిమానులు పండగా చేసుకుంటారు. ఇటీవలే రోబో 2. ఓ సినిమాతో మంచి కమర్షియల్ హిట్ అందుకున్న రజనీ, పేట సినిమాతో సంక్రాంతి బరిలో దిగాడు. తెలుగు, తమిళ బాషల్లో ఓకేసారి రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ షో నుంచే విడుదల అయిన అన్ని సెంటర్స్ లో హిట్ టాక్ తెచ్చుకుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ళు రాబడుతుంది.
సూపర్ స్టార్ ఫ్యాన్స్‌కు ఏం కావాలో అన్ని అంశాలను దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు వడ్డించి ఈ సినిమాని తెరకెక్కించాడు… గత కొంత కాలంగా ఏజ్ బార్ క్యారెక్టర్స్ లో నటిస్తున్న రజినీని పేట సినిమాలో కొత్త లుక్‌లో చూపించాడు. సూపర్ స్టార్ రజనీ కూడా చాలా రోజుల తరువాత స్టైల్, మేనరిజమ్స్ తో ఫ్యాన్స్ కిక్ ఇచ్చే రెంజ్లో ఉండడంతో ఈ సినిమాకు ఓవర్సీస్లో భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. యూ ఎస్‌లో 220 లొకేషన్లలో రిలీజైన పేట ప్రీమియర్ షోల నుంచి మొదటి వారాంతం వరకు తెలుగు, తమిళ, హిందీ లాంగ్వేజ్‌లో 1.5 మిలియన్ డాలర్లు రాబట్టిన్నట్లు ట్రెండ్ వర్గాల సమాచారం.
అయితే కబాలి, 2.ఓ సినిమా ఓపెనింగ్స్‌తో పోలిస్తే, పేటకు వచ్చిన ఒపెనింగ్స్ తక్కువే. అయితే ఇదీ పండగ సీజన్ కావడంతో సంక్రాంతికి తెలుగు , తమిళ్లో భాషల్లో చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి… దీంతో థియేటర్ల కొరత ఏర్పడి.. పేట కలెక్షన్ల పై ప్రభావం పడుతుందని అంతా అనుకున్నారు కానీ అన్ని సినిమాలు ముకుముడిగా దాడి చేసినా పేట మాత్రం నిలకడగా కలెక్షన్స్ రాబడుతుంది. లాంగ్ రన్లో ఎంత వరకూ కలెక్షన్స్ రాబడుతుందో తెలియదు కానీ ఇప్పటికైతే రజినీ బాక్సాఫీస్ స్టామినా ప్రూవ్ చేస్తూ పేట సినిమా అన్ని ఏరియాల్లో కలిపి 100 కోట్ల వసూళ్లు రాబట్టి ట్రేడ్ వర్గాలకే షాక్ ఇచ్చింది. పేట సినిమాకి పోటీగా రిలీజ్ అయిన విశ్వాసం సినిమా తమిళ బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తుంటే మిగిలిన అన్ని చోట్ల మాత్రం పేట హవానే సాగుతుంది. తెలుగు స్ట్రెయిట్ సినిమాలకి కూడా జర్క్ ఇస్తూ డబ్బులు రాబడుతున్న రజినీకాంత్ కి మరికొన్ని థియేటర్స్ దొరికుంటే ఈ పాటికి బ్రేక్ ఈవెన్ చేరిపోయేది. ఇప్పుడున్న ఊపుని ఇలానే కంటిన్యూ చేసినా కూడా వచ్చే వారంలో పేట సినిమా బ్రేక్ ఈవెన్ రీచ్ అయిపోవడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనాలు వేస్తున్నాయి. టాక్ తో సంబంధం లేకుండా, పోటీతో సంబంధం లేకుండా పేట రాబతున్న కలెక్షన్స్ రజినీకాంత్ బాక్సాఫీస్ స్టామినాకి నిలువెత్తు నిదర్శనమని తలైవా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!