రజినీకే షాక్ ఇస్తారా?

రోబో 2.0 సినిమాతో 800 కోట్లు కొల్లగోటి తమిళ బాక్సాఫీస్ ముందెన్నడూ చూడని వసూళ్ల వర్షం కురిపించిన సూపర్ స్టార్ రజినీకాంత్, 40 రోజులు కూడా కాకముందే పెట్ట సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రజిని, కాళీ అనే గ్యాంగ్ స్టర్ పాత్రలో నటిస్తున్నాడు. అనిరుద్ మ్యూజిక్ ఇస్తున్న ఈ సినిమా తమిళ ట్రైలర్ ఇప్పటికే రిలీజ్ అయి ప్రేక్షకులని అలరిస్తుంది. పొంగల్ రేస్ లో సాలిడ్ హిట్ అందుకోవాలని చూస్తున్న రజినీకాంత్ పెట్ట సినిమాని పేటగా మార్చి తెలుగు ప్రేక్షకులకి అందిస్తున్నాడు.

రీసెంట్ గా రిలీజ్ చేసిన తెలుగు పోస్టర్స్ తలైవా అభిమానులకి కొత్త ఎనర్జీ ఇచ్చింది, ఇప్పటి వరకూ పోస్టర్స్ తోనే మెప్పించిన చిత్ర యూనిట్, ఇప్పుడు పేట ట్రైలర్ ని రిలీజ్ చేశారు. తమిళ ట్రైలర్ యధావిధిగా డబ్ చేసితెలుగులో విడుదల చేశారు కానీ ఇక్కడి ప్రేక్షకుల కోసం కొత్తగా ఏమి చూపించలేదు. ట్రైలర్ నిండా రజిని స్వాగ్ మాత్రమే కనిపించింది కాబట్టి ఆయన అభిమానుల పేట సినిమా ఒక పండగ లాంటిది కానీ పేట సంక్రంతి ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. ఇక్కడ బడా సినిమాలు రిలీజ్ పోటీలో ఉండగా రజినీ వాటిని తట్టుకొని నిలబడాలి అంటే భారీ ప్రొమోషన్స్ జరగాలి, ముందెన్నడూ చూడనిది ఏదైనా చూపించాలి. అప్పుడే పేట సినిమా ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసి మంచి వసూళ్లు రాబట్టగలదు, లేదంటే మాత్రం మన సినిమాల వలన రజినీకాంత్ మూవీకి కోలుకోలేని దెబ్బ తగిలే ప్రమాదం ఉంది.