NewsOrbit
సినిమా

రాజకీయాలపై ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చిన సూపర్ స్టార్..!!

super star shock to fans about politics

సినిమాలకు, రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉంది. సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చినవారిలో తెలుగులో ఎన్టీఆర్, తమిళనాడులో ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత.. ఉన్నారు. ప్రస్తుతం తెలుగులో పవన్ కల్యాణ్, తమిళనాడులో రజినీకాంత్, కమల్ హాసన్ పొలిటికల్ పార్టీలు స్థాపించారు. ఇప్పుడు వీరి బాటలోనే తమిళ సూపర్ స్టార్ విజయ్ కూడా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నారని వార్తలు వచ్చాయి. అయితే.. ఈ వార్తలకు కాస్త భిన్నంగా పరిణామాలు జరిగాయి. ఆయన తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ రాజకీయ పార్టీ స్ధాపించారు. దీనిపై విజయ్ స్పందించిన తీరు ఇప్పుడు తమిళనాట సంచలనంగా మారింది.

super star shock to fans about politics
super star shock to fans about politics

విజయ్ కు తమిళనాడులో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తన అభిమాన సంఘంను మక్కళ్ ఇయక్కం అభిమాన సంఘంగా పిలుస్తారు. రీసెంట్ గా విజయ్ తండ్రి చంద్రశేఖర్ రాజకీయ పార్టీ స్థాపించారు. మక్కళ్ ఇయక్కంను రాజకీయ పార్టీగా మారుస్తున్నట్టు ప్రకటించారు. అయితే.. ఇదంతా విజయ్ అనుమతి లేకుండానే జరిగిందని తెలుస్తోంది. దీంతో తండ్రి చర్యపై విజయ్ కాస్త ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. తనకు ఆ పార్టీతో ఎటువంటి సంబంధం లేదని ప్రకటించారు. దీంతో తమిళనాడులో తండ్రీ కొడుకుల మధ్య జరుగుతున్న ఈ అంశం తీవ్ర చర్చనీయాంశమైంది. విజయ్ రాజకీయాల్లోకి రావాలనే డిమాండ్లూ ఎక్కువయ్యాయి. కానీ.. విజయ్ మాత్రం రాజకీయాలపై ఎటువంటి ప్రకటనా చేయలేదు. ఈ నేపథ్యంలో విజయ్ మరికాస్త ముందుకెళ్లి తన నిర్ణయంపై తానెంత గట్టిగా ఉన్నానో తెలియజేశారు.

తమిళనాడులోని 30 జిల్లాల అభిమాన సంఘాల నాయకులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. మధురైలో ఈ సమావేశం జరిగినట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో విజయ్ మాట్లాడుతూ.. ‘నా తండ్రి స్థాపించిన రాజకీయ పార్టీతో నాకు ఎటువంటి సంబంధం లేదు. నా పేరు గానీ, ఫొటో గానీ ఆ రాజకీయ పార్టీలో ఉపయోగించినా.. ఫ్లెక్సీల్లో నా పేరు వాడినా చర్యలు తీసుకుంటాను. ఆ పార్టీలో నా అభిమానులు ఎవరూ క్రియాశీలకంగా పాల్గొనవద్దు. అటువంటి వారిని నా అభిమాన సంఘాల నుంచి తొలగిస్తాను. నాకు రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశం లేదు‘ అని సంచలన ప్రకటన చేశారు. దీంతో వీరిద్దరి మధ్య వచ్చిన భేదాభిప్రాయాలు ఏ పరిణామాలకు దారి తీస్తాయోననే చర్చ మొదలైంది.

author avatar
Muraliak

Related posts

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Brahmamudi April 24 2024 Episode 392: గుడిలో అనామిక రచ్చ.. అనామిక మీద ఫైరైన కనకం.. రుద్రాణి ప్లాన్ ను తిప్పి కొట్టాలనుకున్న అప్పు..

bharani jella

 Trinayani April 24 2024 Episode 1221: గాయత్రి జాడ తెలుసుకోవాలనుకున్న తిలోత్తమ, అద్దంలో కనపడిన హాసిని..

siddhu

Naga Panchami: గుడిలో ఉన్న పంచమి మోక్షకు కనిపిస్తుందా లేదా.

siddhu

Kumkuma Puvvu: ట్రస్ట్ మెంబర్ పంపించిన ఫోటోలని శాంభవి చూస్తుందా లేదా.

siddhu

Nuvvu Nenu Prema April 24 2024 Episode 606: అక్క ఆచూకీ కోసం విక్కీ ఆరాటం.. అరవింద,కృష్ణ దగ్గర ఉందని తెలుసుకున్న దివ్య.. విక్కీ పద్మావతిల ఆనందం..

bharani jella

Krishna Mukunda Murari April 24 2024 Episode 453: మురారి మనసు మార్చిన ముకుంద.. కృష్ణ కి దూరంకానున్న మురారి..ఆదర్శ్ లవ్ ప్రపోజల్..

bharani jella

Vijay Devarakonda: రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో ప్రశాంత్ నీల్ మూవీ..?

sekhar

Pushpa 2: అల్లు అర్జున్ “పుష్ప 2” నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్..!!

sekhar

Zwigato OTT: థియేటర్లలో విడుదలైన రెండు నెలలకు ఓటీటీలోకి వచ్చేస్తున్న కపిల్ శర్మ అవార్డు విన్నింగ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Hanuman Tv contest: టీవీలో హనుమాన్ సెల్ఫీ కాంటెస్ట్.. విజేతలకు దిమ్మ తిరిగే గిఫ్ట్స్..!

Saranya Koduri

Jai Hanuman New Poster: హనుమాన్ జయంతి సందర్భంగా సరికొత్త పోస్టర్ను రిలీజ్ చేసిన జై హనుమాన్ టీం.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 232024 Episode 218: ఆయన అంటే నీకు ఇష్టమేనా అంటున్న అరుంధతి, ఆయనతో పెళ్లి నా అదృష్టం అంటున్న భాగమతి..

siddhu

Malli Nindu Jabili April 23 2024 Episode 630: పిల్లల కోసం హాస్పిటల్ కి వెళ్లిన అరవింద్ మాలినికి షాకింగ్ న్యూస్..

siddhu