Chiranjeevi: టాలీవుడ్ రారాజు మెగాస్టార్ చిరంజీవి, మోహన్ రాజా కాంబినేషన్లో ప్రస్తుతం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘గాడ్‌ఫాదర్’. మలయాళ సూపర్ హిట్ ‘లూసిఫర్’ చిత్రానికిది అఫీషియల్ రీమేక్. ఇందులో చిరంజీవి పొలిటికల్ కింగ్ మేకర్ గా ఓ పవర్ ఫుల్ లీడ్ రోల్ చేస్తున్నారు. ఇక ఆయన సోదరి పాత్రలో నయనతార నటిస్తుండగా, తమ్ముడిగా సత్యదేవ్ నటిస్తున్నాడు. ఇక చిరుకి కుడి భుజం లాంటి మరో పవర్ ఫుల్ రోల్ ను బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ చేస్తున్న విషయం తెలిసినదే.
Chiranjeevi – Ram charan: ఆ మలయాళం రీమేక్ మెగా మల్టీస్టారర్‌గా రావాలంటున్న మెగా ఫ్యాన్స్..?
Chiranjeevi: సూపర్ అప్ డేట్ ఇదే:
ఇక ఈ సినిమాకి సంబంధించిన ఓ సూపర్ అప్ డేట్ వచ్చింది. ఇందులో ప్రజా గాయకుడు గద్దర్ కూడా నటిస్తున్నట్టు సమాచారం. ఇక ఈ విషయాన్ని తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆయనే స్వయంగా చెప్పారు. ఇందులో చిరంజీవి జైలు కెళ్ళే సన్నివేశంలో అక్కడ జైల్లో ఒక వ్యక్తి ఆయనకి పరిచయం అవుతారు. ఆయన చిరంజీవి తండ్రికి స్నేహితుడిగా చెప్పుకుంటాడు. ఆ పాత్రనే గద్దర్ చేస్తున్నట్టు భోగట్టా. ఇందులో ఆయన ఒక పాట కూడా పాడటం విశేషం.
Chiranjeevi: బాబీ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న సినిమాలో హీరోయిన్ డీటెయిల్స్..??
మరింత సమాచారం:
ఈ సందర్భంగా గద్దర్ మాట్లాడుతూ… “నాకు సంబంధించిన షూట్ పూర్తయింది. అలాగే నేను నటించింది కొన్ని సీన్లే అయినా నాకు మంచి పారితోషికం ముట్టజెప్పారు.” అని గద్దర్ చెప్పారు. ఒక రకంగా తను నిజజీవిత పాత్రలో నటించానని, విప్లవ చైతన్య గీతాల కళాకారుడిగానే ఇందులో తన పాత్ర ఉంటుందని చెప్పారు. ఇకపొతే తమన్ ఈ సినిమాకి సంగీతం ఇస్తున్నారు. ఈ ఏడాది చివరలో విడుదల కాబోతున్న ఈ సినిమాకి లక్ష్మీ భూపాల మాటలు అందిస్తున్నారు.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!