Mahesh Babu: టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు గురించి ప్రస్తావన ప్రత్యేకించి అవసరం లేదు. సినీ ప్రపంచంలో అందచందాల విషయం గురించి మాట్లాడేటప్పుడు ఎక్కువగా హీరోయిన్స్ మాట వినబడుతుంది. కానీ హీరోల గ్లామర్ గురించి ఒకరు మాట్లాడుతున్నారంటే అది మహేష్ బాబు గురించే అయి ఉంటుంది అనడంలో అతిశయోక్తి లేదు. అవును.. సూపర్ స్టార్ కృష్ణ తనయుడిగా సిల్వర్ స్క్రీన్‌పై అడుగుపెట్టిన ఆయన అనతికాలంలోనే తెలుగు తెరపై తనదైన మార్క్ క్రియేట్ చేశారు. హీరోల అభిమానుల పరంగా చూస్తే ఫిమేల్ ఫ్యాన్స్ ఎక్కువగా ఉంది ఒక్క మహేష్ బాబుకే అని వేరే చెప్పనవసరం లేదు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఈ విషయం అస్సలు నమ్మబుద్దికాదు!
మహేష్ వయసు 46 సంవత్సరాలు అంటే అస్సలు నమ్మబుద్ధి కాదు. ఇప్పటికీ యువకుడిగా కనిపిస్తాడు కనకనే, టీన్స్ లో వున్న హీరోయిన్స్ కూడా అతగాడితో స్టెప్పులేయడానికి రెడీగా వుంటారు. అయితే వయసు పెరుగుతుంటే ఆయన అందం కూడా రెట్టింపవుతుండటం వెనుక సీక్రెట్ ఏంటి అనేది ప్రతి ఒక్కరికీ ఒకింత ఆశ్చర్యకర విషయమే. తాజాగా అదే రివీల్ చేస్తూ ఫన్నీ కామెంట్స్ చేశారు మహేష్ బాబు తండ్రి, సీనియర్ హీరో కృష్ణ. అవును… మహేష్ బాబు లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట చూసిన కృష్ణ ఈ సినిమాపై తన అభిప్రాయాన్ని చెబుతూ ఓపెన్ అయ్యారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఆ సీక్రెట్ ఇదే:
ఈ సందర్భంగా మాట్లాడిన కృష్ణ సినిమా చాలా బాగుందని చెబుతూనే మహేష్ గ్లామర్‌పై స్పందించారు. సదరు విలేఖరి మహేష్ అందంపైన వేసిన ప్రశ్నకు బదులుగా.. మహేష్ తన ఫిజిక్‌పై స్పెషల్ కేర్ తీసుకుంటారని, సినిమాలు లేని సమయంలో రెగ్యులర్‌గా జిమ్‌కు చేస్తుంటాడని, అలా క్రమశిక్షణతో మెయింటెయిన్ చేస్తున్నాడు కాబట్టే ఇంత అందంగా ఉన్నాడంటూ నవ్వుతూ సెలవిచ్చారు. సర్కారు వారి పాట సినిమా విషయానికొస్తే.. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాలో మహేష్ బాబు జంటగా కీర్తి సురేష్ నటించింది. విడుదలకు ముందు నుంచే నెలకొన్న హైప్ సినిమాకు భారీ ఓపెనింగ్స్ తెచ్చిపెట్టింది.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!