Superstar Krishna: నవంబర్ 15వ తేదీన సూపర్ స్టార్ కృష్ణ తుది శ్వాస విడవటం తెలిసిందే. శ్వాస మరియు గుండె సంబంధిత అనారోగ్యంతో హైదరాబాద్ కాంటినెంటల్ హాస్పిటల్ లో జాయిన్ అయ్యి కార్డియాక్ అరెస్టుతో మరణించడం జరిగింది. కృష్ణ మరణంతో సినిమా ఇండస్ట్రీ తో పాటు అభిమానులు ఎంతో కలత చెందారు. ముఖ్యంగా మహేష్ బాబు తండ్రి కృష్ణ మరణంతో కన్నీరు మున్నీరయ్యాడు. తెలుగు సినిమా రంగానికి ఎన్నో విశిష్ట సేవలు అందించిన కృష్ణ మరణానికి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా నివాళులు అర్పించడం తెలిసిందే. ఇదంతా పక్కన పెడితే తెలుగు సినిమా రంగంలో కొత్త టెక్నాలజీని పరిచయం చేయటంలో అప్పట్లో కృష్ణ ప్రముఖ పాత్ర పోషించడం జరిగింది. కాగా హీరోగా, నిర్మాతగా ఇంకా దర్శకుడిగా కృష్ణ విజయవంతంగా రాణించటంలో తెర వెనక ఆయన సోదరుడు ఆదిశేషగిరిరావు పాత్ర అతి పెద్దది. తమ్ముడు ఆదిశేషగిరిరావుతో డిస్కషన్ జరిగిన తర్వాతే ఏ ప్రాజెక్టు అయినా కృష్ణ స్టార్ట్ చేసేవాళ్ళు. అటువంటి అనుబంధం ఇద్దరి అన్నదమ్ముల మధ్య ఉండేది.
ఈ నేపథ్యంలో కృష్ణ మరణించాక లేటెస్ట్ ఇంటర్వ్యూలో ఆదిశేషగిరిరావు మాట్లాడుతూ… నా చిన్ననాటి టైంలో సైకిల్ పై మా అన్నయ్య సినిమాలకు తీసుకెళ్లడం ఇప్పటికీ ఇంకా గుర్తుంది. మద్రాసులో ఆయన దగ్గరే ఉంటూ నేను చదువుకునేవాడిని. “అల్లూరి సీతారామరాజు” సినిమా విడుదల అయ్యేవరకు ఆయన రోజుకి మూడు షిఫ్టులు పనిచేస్తూ వచ్చారు. “అల్లూరి సీతారామరాజు” ఒకే కెమెరాతో ఒకే లెన్స్ తో… చిత్రీకరించారు. అయినా గాని ఈ సినిమాకి ఎటువంటి వంకా పెట్టలేం అని చెప్పుకొచ్చారు.
అన్నయ్యకి తాను చేసే ప్రతి సినిమాపై మంచి అవగాహన ఉండేది. ఏ సినిమా ఎందుకు ఆడింది..? ఎందుకు పరాజయం పాలయ్యింది..? సినిమాకి ఎందుకు ఓపెనింగ్స్ పెరిగాయి..? ఎందుకు తగ్గాయి..? ఇలా ప్రతి విషయంలో… ఆయనకు ఉండే అవగాహనా చాలా అద్భుతం. అన్నయ్యతో నాకు 70 ఏళ్ల అనుబంధం ఉంది. ఆయన ఇప్పుడు లేకపోవడం ఒక్కసారిగా శూన్యం అయిపోయింది. అయితే అన్నయ్యకు సంబంధించి స్మారకమందిరాన్ని నిర్మించాలనే ఆలోచన ఉంది. ఇందుకు సంబంధించిన నిర్ణయాన్ని త్వరలో తీసుకుంటామని ఇంటర్వ్యూలో ఆదిశేషగిరిరావు తెలియజేశారు.
Shobha Shetty: ఆ పార్ట్స్ చూపిస్తూ రోడ్ ఎక్కిన శోభా శెట్టి.. ఘోరంగా ట్రోల్స్..!