యాక్షన్ డైరెక్టర్ హరితో అరువా సినిమా అనౌన్స్ చేసిన సూర్య…

Share

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ మూవీ ఫస్ట్ లుక్ అప్డేట్… టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారితే, కోలీవుడ్ లో సూర్య 39వ సినిమా అప్డేట్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ప్రస్తుతం ఆకాశం నీ హద్దురా సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న సూర్య, నెక్స్ట్ సినిమాని వెట్రిమారన్ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఇది సెట్స్ పై ఉండగానే మరో మూవీని సూర్య మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నాడు. అందులో భాగంగానే సూర్య తన నెక్స్ట్ సినిమా ‘అరువా’ని స్టూడియో గ్రీన్ బ్యానర్ లో అనౌన్స్ చేశాడు.

View image on Twitter

సూర్యతో ఇప్పటివరకూ అయిదు సినిమాలు చేసిన హరి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మూవీ ఏప్రిల్ లో సెట్స్ పైకి వెళ్లనుంది. 2005లో మొదలైన ఈ హీరో డైరెక్టర్ కాంబినేషన్ లో ఇప్పటివరకూ 5 సినిమాలు వచ్చాయి అందులో ముఖ్యంగా సింగం సిరీస్ కి ఇండియన్ ఫిల్మ్ ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. అన్ని భాషల్లో అదే పేరుతో రిలీజ్ అయిన సింగం సినిమా ఆల్ ఏరియాస్ లో కమర్షియల్ సక్సస్ సాధించింది. చివరగా సింగం 3తో ప్రేక్షకుల ముందుకి వచ్చిన సూర్య అండ్ హరి మూడేళ్ళ తర్వాత మళ్లీ కలిసి సినిమా చేస్తున్నారనడంతో కోలీవుడ్ సినీ అభిమానులు ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. నిజానికి ఈ సినిమా జ్ఞానవేల్ రాజా దర్శకత్వంలో ఉంటుందని అంతా అనుకున్నారు కానీ ఎవరు ఊహించని విధంగా హరి లైన్ లోకి వచ్చాడు. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ మూవీకి ఇమ్మాన్ మ్యూజిక్ అందించనున్నాడు.


Share

Related posts

Hari Prriya Latest Gallerys

Gallery Desk

Atlee : అట్లీ రెండేళ్ళ నుంచి వేయిట్ చేస్తున్నాడు…బాద్షా ఛాన్స్ ఇస్తాడా..?

GRK

బిగ్ అప్‌డేట్ : రాధేశ్యామ్ కి రిలీజ్ డేట్ లాక్ చేసిన ప్రభాస్ ..?

GRK

Leave a Comment