Pawan: ఏంటి ఆశ్చర్యంగా వుందా? బేసిగ్గా అవసరమైతే తప్ప బయటకు వెళ్లని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రెబల్ స్టార్ ప్రభాస్ ని సర్ప్రైజ్ చేయడమేంటని ఆశ్చర్యపోతున్నారా? కానీ ఇది నిజం. అవును.. అభిమానులు అసంగతి పక్కన బెడితే, తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోల మధ్య ఎప్పుడూ మంచి స్నేహపూర్వక వాతావరణం ఉంటుందని వేరే చెప్పనవసరం లేదు. ఒకరి ఈవెంట్స్ కు మరొకరు వెళ్తూ ఉంటారు. ఒకరి సినిమా షూటింగ్ లొకేషన్లోకి మరొకరు వెళ్లి సందడి చేస్తుంటారు. అయితే కొందరు ముందుగా సమాచారం ఇచ్చి షూటింగ్ స్పాట్‌కు వెళ్తే..మరికొందరేమో సర్ప్రైజ్ ఇస్తుంటారు.
Bheemla Nayak: ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే భయంతో వాళ్ళందరికీ వెన్నులో వణుకొచ్చేస్తుందా..?
Pawan: పవర్ స్టార్ సర్ప్రైజ్ ఇదే:
సరిగ్గా ఇక్కడ అలాంటిదే జరిగింది. అవును… పవన్ కల్యాణ్ ప్రభాస్ కు ఇపుడు ఓ సర్ప్రైజ్ ఇచ్చాడు. ప్రస్తుతం ప్రభాస్ చిత్రాల్లో ఒకటి ప్రాజెక్టు కే. కొన్ని నెలలుగా ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్, రామోజీ ఫిలిం సిటీలో వేసిన ప్రత్యేక సెట్స్ లో చిత్రీకరణ జరుపుకుంటోంది. తాజా సమాచారం ప్రకారం బిగ్ బి అమితాబ్ బచ్చన్, ప్రభాస్‌లపై వచ్చే కీలక సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరిస్తున్నారట. అయితే అదేచోట భీమ్లా నాయక్ షూటింగ్లో ఉన్న పవన్ కల్యాణ్.. విరామ సమయంలో ప్రాజెక్టు కే లొకేషన్ వెళ్లి..ప్రభాస్, బిగ్ బీకి సర్ప్రైజ్ ఇచ్చాడట!
Bhumika: ఆ సూపర్ హిట్ సాంగ్‌కి భూమిక డ్యాన్స్ ఇరగదీసిందిగా.. వీడియో వైరల్!
బ్రేక్ ఫాస్ట్ కూడా కలిసి చేశారట!
అక్కడితో ఆగకుండా ఈ ముగ్గురు స్టార్ హీరోలు కలిసి బ్రేక్ ఫాస్ట్ కూడా ఆరగించారట. ఇకపోతే కరోనా వలన సినిమా విడుదలలు, సినిమా షూటింగ్స్ వాయిదా పడిన సంగతి తెలిసినదే. తాజాగా కొంత రిలీఫ్ రావడంతో సినిమా షూటింగులు కొనసాగుతున్నాయి. అలాగే వాయిదా పడిన సినిమాలు కాస్త వరుస రిలీజు డేట్స్ అనౌన్స్ చేస్తున్నాయి. వచ్చే శుక్రవారం అనగా, ఫిబ్రవరి 18న పవర్ స్టార్ నటించిన ‘భీమ్లా నాయక్’ రిలీజ్ అవ్వబోతోంది.