తమిళంతో పాటు తెలుగులో మార్కెట్ ఉన్న హీరోల్లో సూర్య ఒకరు. ఈయన ప్రస్తుతం సుధా కొంగర దర్శకత్వంలో ‘ఆకాశం నీ హద్దురా’ అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదలకు సిద్ధమవుతుంది. ఈ సినిమా పూర్తి కాగానే సూర్య తదుపరి చిత్రం ఖరారైంది. రీసెంట్గా తమిళంలో ఘన విజయం సాధించిన చిత్రం ‘అసురన్’ దర్శకుడు వెట్రిమారన్, నిర్మాత కలైపులి థాను కాంబినేషన్లో మరో సినిమా రూపొందనుంది. ఈ సినిమాలో సూర్య హీరోగా నటించబోతున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయట. సూర్య వంటి డిఫరెంట్ సినిమాలు చేయాలనుకునే హీరో, డిఫరెంట్ సినిమాలను తెరకెక్కించే వెట్రిమారన్లాంటి డైరెక్టర్‌తో సినిమా అంటే సినిమాపై ఎలాంటి అంచనాలు ఏర్పడతాయనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాగే సూర్యకు తమిళంతో పాటు తెలుగులో మార్కెట్ ఉండటంతో నిర్మాత కలైపులి థానుకి కూడా ఈ ప్రాజెక్ట్ కలిసి వచ్చినట్టేనని అనుకోవచ్చు.
previous post
next post