Surya Vijay: బాలీవుడ్ మొదలుకొని సౌత్ ఫిలిం ఇండస్ట్రీ వరకు మార్కెట్ పెంచుకోవడానికి హీరోలు నానా తంటాలు పడుతున్నారు. బాహుబలి పుణ్యమా తెలుగు సినిమా మార్కెట్ బాగా పెరిగిపోయింది. దీంతో ఇండియాలో ఉన్న హీరోలందరి లో ప్రభాస్ కి నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయిలో మార్కెట్ క్రియేట్ అయింది. ఇప్పుడు ఇదే విధంగా మిగతా హీరోలు కూడా రాణించాలని ఎక్కువగా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఈ తరుణంలో ఆల్రెడీ తెలుగులో కోలీవుడ్ స్టార్ హీరోలు సూర్య, విజయ్ లకి మార్కెట్ ఉన్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరవడానికి ఇద్దరు హీరోలు ఇప్పుడు సరికొత్త ఫార్ములా ప్రయోగించనునట్లు కోలీవుడ్ వర్గాలు తెలియజేస్తున్నాయి. ఇక నుండి తమ సినిమాలు ఏదైతే తెలుగులో రిలీజ్ అవుతాయో వాటికి తామే డబ్బింగ్ సొంతంగా చెప్పుకోవాలని డిసైడ్ అయ్యారట. ఈ క్రమంలో ఇప్పటికే సూర్య గ్యాంగ్ స్టార్ సినిమాకి చెప్పటం జరిగింది. దీంతో నెక్స్ట్ తెలుగు లో రిలీజ్ అయిన ప్రతి సినిమాకి తానే సొంతంగా డబ్బింగ్ చెప్పాలని అనుకుంటున్నాడట.
ఈ క్రమంలో విజయ్ టాలీవుడ్ టాప్ నిర్మాత దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేస్తున్న సినిమా కి… తానే సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవాలని.. తెలుగు భాష నేర్చుకోవడానికి ప్రత్యేకమైన టైం కేటాయిస్తున్నట్లు మీడియా వర్గాలు తెలియజేస్తున్నాయి. ఇక ఇదే తరుణంలో వంశీపైడిపల్లి సినిమా కంటే ముందుగానే బీస్ట్ సినిమా తెలుగులో విడుదల అవుతున్న ఈ క్రమంలో దీనికి కూడా ముందుగానే తెలుగులో డబ్బింగ్ చెప్పాలని విజయ్.. అనుకుంటున్నట్లు ఈ రీతిగా సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్న తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరవడానికి సూర్య విజయ్ ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!