ఒకరేమో సీనియర్ హీరో తెలుగు,తమిళంలో మంచి నేమ్ ఫేమ్ ఉన్న హీరో.. మరొకరేమో రీసెంట్గా ఎంట్రీ ఇచ్చిన కుర్ర హీరో. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకకుండా ఇండస్ట్రలోకి వచ్చి వరుస విజయాలతో స్టార్ హీరో రేంజ్‌కు చేరుకున్నాడు. ఇద్దరూ ఎవరో కాదు.. ఒకరేమో సూర్య.. కుర్ర కథానాయకుడేమో విజయ్ దేవరకొండ. ఇద్దరికీ మంచి స్నేహం కూడా ఉంది. ఇప్పుడు వీరిద్దరూ బాక్సాఫీస్ పోరులో ఢీ అంటే ఢీ అంటున్నారు. వివరాల్లోకెళ్తే.. సూర్య హీరోగా సెల్వ రాఘవన్ దర్శకత్వంలో రూపొందుతున్న పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ మూవీ `ఎన్.జి.కె(నందగోపాలకృష్ణ). మరో పక్క విజయ్ దేవరకొండతో భరత్ కమ్మ అనే డెబ్యూ డైరెక్టర్ చేస్తున్న చిత్రం `డియర్ కామ్రేడ్`. ఇందులో విజయ్ దేవరకొండ కాలేజ్ విద్యార్థి నాయకుడిగా కనిపిస్తున్నాడు. రెండు సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. ఈ రెండు సినిమాలు మే 31నే బాక్సాఫీస్ వద్ద పోటీ పడబోతున్నాయి. డియర్ కామ్రేడ్ టీజర్‌ను నాలుగు దక్షిణాది భాషల్లో విడుదల చేసిన విజయ్ దేవరకొండ.. సినిమాను కూడా నాలుగు భాషల్లో విడుదల చేస్తాడా? అని తెలియడం లేదు కానీ.. తమిళ్లో మాత్రం విడుదల చేస్తే రెండు చిత్రాలు తెలుగు, తమిళ భాషల్లో ఢీ అంటే ఢీ అనడం ఖాయం. మరి విజేత ఒకరే అవుతారో.. లేక ఇద్దరూ విజేతలుగా నిలుస్తారో చూడాల్సిందే..
previous post
next post