Surya Bala: సౌత్ ఫిలిం ఇండస్ట్రీ లో డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలను తెరకెక్కించడంలో దర్శకుడు బాల పని తీరు వేరు. వెరైటీ కథాంశాలతో హీరో నటనకు ఎక్కువ ఆస్కారం ఉండే సినిమాలను.. చేస్తుంటాడు. డైరెక్టర్ బాల కెరియర్ లో “శివ పుత్రుడు”.. అతి పెద్ద భారీ బ్లాక్ బస్టర్ సినిమా. తెలుగులో కూడా డాబ్ అయి సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో సూర్య, విక్రమ్ కలిసి నటించారు. మొదట తమిళంలో తెరకెక్కిన “శివపుత్రుడు” సూపర్ డూపర్ హిట్ కావడంతో తర్వాత 2003వ సంవత్సరంలో తెలుగులో డబ్ అయి… బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
తమిళ ఇండస్ట్రీలో తిరుగులేని కాంబినేషన్ సూర్య- బాలది. వీరిద్దరి కాంబినేషన్ లో “శివ పుత్రుడు” తర్వాత “ఆక్రోషం” సినిమా రావడం జరిగింది. మళ్లీ చాల కాలం తవాత కాంబినేషన్ లో మూడో సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. తమిళ్ లో మోస్ట్ పాపులర్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న..ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ జూన్ మాసంలో ప్రారంభమయి..34 రోజులు ఏకధాటిగా షూటింగ్ జరుపుకోనుందట. కన్యాకుమారిలో మొదటి షెడ్యూల్ ప్లాన్ చేసినట్లు సమాచారం.
ఇక గోవాలో రెండవ షెడ్యూల్ ప్రారంభం కానుందని జూన్ తర్వాత సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్.. జరగనుందని సమాచారం. అతి తక్కువ టైమ్ లోనే సినిమా కంప్లీట్ చేయాలని డైరెక్టర్ బాల సూర్య డిసైడ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే గతంలో ఎన్నడూ చూడని రీతిలో హీరో సూర్యని… ఒక సరికొత్త పాత్రలో బాల చూపించినున్నట్లు… తమిళ ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం హీరో సూర్య మంచి జోరుమీద ఉన్నాడు. “జై భీమ్” తిరుగులేని విజయం సాధించటంతో పాటు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గెలుచుకోవడంతో బాలా సినిమానీ హీరో సూర్య చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు అని టాక్.