Surya Bala: నటుడు సూర్య డైరెక్టర్ బాల దర్శకత్వంలో ప్రస్తుతం ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో అనేక సినిమాలు రావడం జరిగాయి. సూర్య.. బాల కాంబినేషన్ లో చాలా హైలెట్ సినిమా శివ పుత్రుడు. ఈ సినిమాలో హీరో విక్రమ్ తో పాటు సూర్య అదే విధంగా సంగీత , లైలా నటించడం జరిగింది. తమిళంతో పాటు తెలుగులో కూడా ఈ సినిమా విడుదల అయ్యి సూపర్ డూపర్ హిట్టయ్యింది. ఆ తర్వాత అనేక సినిమాలు వీరిద్దరి కాంబినేషన్ లో రాగ మళ్ళీ… చాలా సంవత్సరాల తర్వాత ఇటీవల మరో సినిమా స్టార్ట్ కావడం జరిగింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
అయితే హఠాత్తుగా ఇటీవల సూర్య ..బాల కాంబినేషన్ లో వస్తున్న సినిమా కొన్ని అనివార్య కారణాలవల్ల ఆగిపోయినట్లు సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ వార్త పై సూర్య ఫ్యాన్స్ ఖంగారు పడ్డారు. దీంతో జరుగుతున్న ప్రచారం పై హీరో సూర్య స్పందించారు. డైరెక్టర్ బాల దర్శకత్వంలో చేస్తున్న సినిమా షూటింగ్ తొలి షెడ్యూల్ ఇటీవలే కంప్లీట్ అయింది అని తెలిపాడు. అదే రీతిలో సెకండ్ షెడ్యూల్ త్వరలో ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. మొదటి షెడ్యూల్ కన్యాకుమారి పరిసర ప్రాంతాలలో షూటింగ్ జరుపుకుంది. ఇక రెండవ షెడ్యూల్ షూటింగ్ కి సంబంధించి ఆప్ డేట్ త్వరలో తెలియజేస్తామని సూర్య తెలిపారు.
దీంతో సినిమా ఆగిపోయినట్లు వస్తున్న వార్తలకు సూర్య ఇచ్చిన క్లారిటీతో పుల్ స్టాప్ పడిపోయింది. దాదాపు 17 సంవత్సరాల తర్వాత మళ్లీ వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తూ ఉండటంతో .. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కరోనా కారణంగా దాదాపు రెండు సంవత్సరాల పాటు షూటింగ్ లు బ్రేకులు పడుతు.. జరగటంతో ఈ సినిమా వీలైనంత త్వరగా కంప్లీట్ చేసే దిశగా.. సినిమా యూనిట్ కృషి చేస్తోంది. ఈ సినిమాలో డైరెక్టర్ బాల గతంలో సూర్యని ఎన్నడూ చూడనీ రీతిలో వైవిధ్యంగా చూపిస్తున్నట్లు సమాచారం.