ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో సౌత్ ఫిలిం ఇండస్ట్రీ హవా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా దక్షిణాదిలో తెలుగు సినిమా రంగంకి బాగా ప్రాధాన్యత పెరిగింది. దీంతో చాలామంది బాలీవుడ్ మరియు దక్షిణాదిలో పలు ఇండస్ట్రీలకు చెందిన వాళ్లు తెలుగు దర్శకులతో మరియు నిర్మాతలతో పనిచేయడానికి రెడీ అవుతున్నారు. ఇదిలా ఉంటే తమిళ స్టార్ నటుడు సూర్యకి ఎప్పటినుండో తెలుగులో మార్కెట్ ఉన్న సంగతి తెలిసిందే. శివ పుత్రుడు, గజిని… ఇంకా చాలా సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించాడు.
సూర్య గారినీ కలిసిన టైంలో అదే నాకు చెప్పారు.. షణ్ముక్ వైరల్ కామెంట్స్..!!
అయితే ఇప్పటివరకు మాత్రం సూర్య తెలుగులో స్ట్రెయిట్ మూవీ చేయలేదు. కానీ చానాల తర్వాత ఎట్టకేలకు సూర్య తెలుగులో సినిమా చేయడానికి ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు లేటెస్ట్ వార్త వైరల్ అవుతుంది. పూర్తి విషయంలోకి వెళ్తే తెలుగులో గోపీచంద్ తో “శౌర్యం” సినిమా తెరకెక్కించిన శివతో సూర్య సినిమా చేయటానికి రెడీ అయినట్లు వార్త ఒకటి వైరల్ అవుతుంది. ఇదే డైరెక్టర్ శివ తమిళంలో పలు సూపర్ హిట్ సినిమాలు చేయడం జరిగింది. దీంతో తమిళం మరియు తెలుగులో శివ దర్శకత్వంలో సినిమా చేయడానికి సూర్య ఓకే చెప్పినట్లు టాక్.
గతంలోనే బోయపాటి దర్శకత్వంలో సూర్య సినిమా చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆ ప్రాజెక్టు ఇంకా పట్టాలెక్కలేదు. కానీ చాలా కాలం తర్వాత ఇప్పుడు సూర్య … శివ దర్శకత్వంలో తెలుగు సినిమా చేయడానికి రెడీ అయినట్లు టాక్ నడుస్తోంది. ఇప్పటికే విజయ్ మరికొంతమంది తమిళ హీరోలు తెలుగు దర్శకులతో సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు ఇదే కోవలో హీరో సూర్య రావడం సంచలనం రేపింది. ప్రస్తుతం సూర్య… బాలా దర్శకత్వంలో వైవిధ్యమైన సినిమా చేస్తున్నారు. ఇందులో మూడు డిఫరెంట్ పాత్రలలో సూర్య ని బాగా చూపిస్తున్నట్లు టాక్. ఈ ప్రాజెక్టు తర్వాత మరో తమిళ ప్రాజెక్టు ఉంటుందని దాని తర్వాత.. తెలుగు సినిమా సూర్య చెయ్యనున్నట్లు సమాచారం.