ఎక్కడైనా సరే, ఎదుటివ్యక్తిని గౌరవించినప్పుడు, ఎదుటి వ్యక్తిలో ఉన్న ప్రతిభను గుర్తించినప్పుడు అంతా పాజిటివ్‌గా ఉంటుంది. ఒకరిని చూసి మరొకరు ఎంతో కొంత నేర్చుకోగలిగితే మరీ ఆనందం. తాజాగా తెలుగు విలక్షణ నటుడు డా.మంచు మోహన్‌బాబు, తమిళ హీరో సూర్య, మధ్య అలాంటి సుహృద్భావ పరిస్థితులే ఏర్పడ్డాయి. మోహన్‌బాబు, సూర్య కలిసి ఓ సినిమా కోసం పనిచేస్తున్నారు. సుధా కొంగర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు తమిళంలో `సూరరై పోట్రు` అని పేరు పెట్టారు. తెలుగులో ఇంకా పేరేమీ పెట్టలేదు. మోహన్‌బాబు ఓ షెడ్యూల్ చేశారు. ఆయన గురించి సూర్య ట్విట్టర్లో “మోహన్‌బాబు సార్ చాలా క్రమశిక్షణ ఉన్న నటుడు. ఐదు వందలకు మించిన చిత్రాల్లో నటించినప్పటికీ ఆయన నటనకు ఇచ్చే గౌరవం చూస్తుంటే ముచ్చటేస్తుంది. ఆయన దగ్గర ఎంతో నేర్చుకోవాలి. ఆయన ఈ సినిమాలో చేస్తున్నందుకు కృతజ్ఞతలు“ అని ట్వీట్ చేశారు. అది చూసిన మోహన్‌బాబు స్పందించారు. “ఈ జనరేషన్ టాప్ స్టార్ సూర్య“ అని ప్రశంసించారు. తదుపరి షెడ్యూల్ కోసం ఎదురుచూస్తున్నట్టు తెలిపారు.
previous post
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!