సినిమా

Jai Bhim: “జై భీమ్”కి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ లు ..!!

Share

Jai Bhim: డీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కిన “జై భీమ్” గత ఏడాది నవంబర్ రెండో తారీకు రిలీజ్ అయ్యి సెన్సేషనల్ హిట్ అయిన సంగతి తెలిసిందే. “జై భీమ్” టైటిల్ రోల్ పోషించిన హీరో సూర్యకి ఈ సినిమాతో మంచి పేరు వచ్చింది. ఈ సినిమాలో సూర్యతో పాటు మణికందన్, లిజోమోల్ జోస్, రజిషా విజయన్, ప్రకాష్‌రాజ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. చంద్రు అనే న్యాయవాదిగా సూర్య నటించారు. సమాజంలో బలహీన వర్గాలు.. గిరిజనుల తరఫున న్యాయ పోరాటం చేసే.. లాయర్ పాత్రలో సూర్య నటనకి విమర్శకుల నుండి సైతం ప్రశంసలు లభించాయి.

surya's jai bhim wins two dadasaheb phalke awards

ఒక్క రూపాయి తీసుకోకుండా బలహీనవర్గాల తరుపున న్యాయ పోరాటం చేసే నిజాయితీ కలిగిన  న్యాయవాదిగా.. న్యాయస్థానంలో సూర్య పలికించిన హావభావాలు మనసును ఎంతగానో తాకుతాయి. పోలీసులు అన్యాయంగా అరెస్టు చేసిన తన భర్తను విడిపించుకునేందుకు ఓ గిరిజన మహిళ చేసిన పోరాటానికి.. నీతి నిజాయితీ ఉన్న న్యాయవాది అండగా నిలబడటమే “జై భీమ్” స్టోరీ కథాంశం.

surya's jai bhim wins two dadasaheb phalke awards

 

ఒక యదార్థ సంఘటనలను ఆధారం చేసుకుని తెరకెక్కించిన ఈ సినిమా… విడుదలైన ప్రతి చోట తిరుగులేని విజయం సాధించడం జరిగింది. అంతమాత్రమే కాదు “ఆస్కార్”ఎంట్రీకి “జై భీమ్” సెలక్ట్ కావడం కూడా జరిగింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాకి ఇండియాలో ప్రముఖ అవార్డు దాదాసాహెబ్ ఫాల్కే .. అవార్డులు రెండు.. గెలుచుకోవటం జరిగింది. ఉత్తమ చిత్రం మరియు ఉత్తమ సహాయనటుడుగా సినిమాలో బాధితుడు పాత్ర పోషించిన మణికందన్..కి అవార్డు వచ్చినట్లు సమాచారం. దీంతో “జై భీమ్”కి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ లు రెండు వచ్చినట్లు వార్త తెలుసుకుని సూర్య ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. 


Share

Related posts

బిగ్ బాస్ 4 : నాగార్జున ప్లాన్ అదిరింది..! హారికకు అభిజిత్ కి మధ్య గొడవ పెట్టేశాడు

arun kanna

Uday Kiran: ఓటీటీలో విడుదలకానున్న ఉదయ్ కిరణ్ ఆఖరి చిత్రం..!!

bharani jella

Sonusood : సోనూ సూద్ సహాయం చేయడం చూశారు , సోనూ సిక్స్ ప్యాక్ చూసారా ? ఇంటర్నెట్ ని వేడి పుట్టిస్తోన్న ఫోటో

bharani jella
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar