సుశాంత్ సింగ్ సూసైడ్ కేసులో వెలుగులోకి వస్తున్న విషయాలు సంచలనాలు రేపుతున్నాయి. కేసుకు సంబంధించి అందరి ఫోకస్ సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా పై ఉంది. ఇదిలా ఉండగా డ్రగ్స్ వంటి కీలక విషయాల్లో నార్కో అధికారులు రియా చక్రవర్తి ని ఇప్పటికే అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. పరిస్థితి ఇలా ఉండగా వాస్తవానికి మొదటిలో సుశాంత్ సింగ్ మరణానికి కారణం బాలీవుడ్ మాఫియా అని తెగ గగ్గోలు పెట్టి కామెంట్లు చేసిన స్టార్ హీరోయిన్ కంగనారనౌత్… తాజాగా రియా చక్రవర్తి ని టార్గెట్ చేసి భారీ డైలాగులు వేసింది.
ఒక డ్రగ్ అడిక్ట్ ఒక సూపర్ స్టార్ సొమ్ము మీద ఆశపడే బ్రతుకు నాది కాదు అంటూ కంగనా పరోక్షంగా రియ పై రెచ్చిపోయింది. మరోపక్క అరెస్ట్ అయిన తరువాత తన గదిలో ఫ్యాన్ సరిగ్గా తిరగడం లేదని, కనీసం పడుకోడానికి సదుపాయాలు కూడా లేవు అని రియా తన లాయర్ తో అన్నట్లు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ కావటంతో నెటిజన్లు మండిపడుతున్నారు.
ఒక స్టార్ హీరో ని పొట్టన పెట్టుకుని, నీ స్వార్థం కోసం అతనిని మత్తుమందులకు అలవాటు చేసి, మానసిక క్షోభకు గురి చేసి, డిప్రెషన్ కి లోను చేసి, చచ్చి పోయేలాగా చేసి… నిద్ర సరిగ్గా పట్టడం లేదు అని అనడానికి సిగ్గు లేదా అని రియా చేసిన కామెంట్లపై నెటిజన్లు మండిపడుతున్నారు. మరోపక్క బెయిల్ కోసం నానా తంటాలు పడుతున్న రియా చక్రవర్తి…బయటకు రావటానికి ఎలాగైనా బెయిల్ సంపాదించడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారట.