సుశాంత్ పై ప్లేటు ఫిరాయించిన రియా.. అతనే డ్రగ్స్ కి బానిసై నన్ను వాడుకున్నాడు!

సుశాంత్ సింగ్ రాజపుత్ మరణం బాలీవుడ్ లో ఎలాంటి అలజడి సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక అలాంటి యంగ్ టాలెంటెడ్ హీరో కేసు దర్యాప్తు చేసే సమయంలో సూసైడ్ కేసు కాస్త డ్రగ్స్ కేసుగా మారిపోయింది. ఇక డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయినా రియా చక్రవర్తి ఇప్పుడు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది.

 

దుర్గ్స్ కేసులో రియా తన తమ్ముడు ఇరుక్కొని బెయిల్ దొరకక ఇబ్బంది పడుతున్న సమయంలో సుశాంత్ సింగ్ డ్రగ్స్ కోసం ఆమెను వాడుకున్నట్టు తెలిపింది. అంతేకాదు సుశాంత్ సింగ్ రాజపుత్ తరచుగా డ్రగ్స్ ని వినియోగిస్తున్నాడని, డ్రగ్స్ కు బానిసగా మారిపోయాడని, తన పేరు బయటకు రాకుండా వేరే వాళ్లతో కొనిపించేవాడని ఆమె తెలిపింది.

ఇక అలానే తన పేరు మీద, తన తమ్ముడు పేరు మీద డ్రగ్స్ కొన్నట్టు.. వారు ఎప్పుడు వాడలేదని ఆమె తెలిపింది. కేదారనాధ్ సినిమా షూటింగ్ సమయంలో సుశాంత్ సింగ్ డ్రగ్స్ కి అలవాటు పడ్డట్టు.. కానీ అవి బయటకు రాకుండా జాగ్రత్త పడినట్టు ఆమె ఆరోపణలు చేసింది. మరి ఇందులో ఎంత నిజం ఉందనేది తెలియలేదు కానీ రియా చక్రవర్తి సుశాంత్ సింగ్ రాజపుత్ పై చేసిన ఆరోపణలను చూసి రియా చక్రవర్తిపై సుశాంత్ అభిమానులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రేమించిన వ్యక్తి.. చనిపోయిన వ్యక్తిపై ఇలాంటి ఆరోపణలు చేయడం ఎంతవరకు న్యాయం అంటూ దుమ్మెత్తి పోస్తున్నారు.