NewsOrbit
సినిమా

Mega 154: `మెగా 154`లో భాగ‌మ‌వుతున్న చిరు పెద్ద కూతురు..!

Mega 154: వ‌రుస ప్రాజెక్ట్స్‌ను లైన్‌లో పెడుతూ దూసుకుపోతున్న మెగాస్టార్ చిరంజీవి త‌న 154వ చిత్రాన్ని బాబీతో చేయ‌నున్నట్లు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. వైజాగ్ బ్యాక్ డ్రాప్‌లో ప‌క్కా మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రంలో శ్రుతి హాస‌న్ హీరోయిన్‌గా న‌టించ‌బోతోంది. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండ‌గా.. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ స్వరాలు అందిస్తున్నారు.

ఇప్పటికే పూజా కార్యక్రమాలను పూర్తిచేసుకుని సెట్స్ మీద‌కు వెళ్లిన ఈ చిత్రంలో చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత కొణిదెల కూడా భాగం అయింది. వృత్తి పరంగా సుస్మిత కాస్ట్యూమ్ డిజైనర్‌. ఈ నేపథ్యంలో `మెగా 154` మూవీకి ఆమె కాస్ట్యూమ్ డిజైనర్ గా వర్క్ చేస్తున్నారు. ఈ విష‌యాన్ని డైరెక్ట‌ర్ బాబీ స్వ‌యంగా వెల్ల‌డించారు.

ఈ రోజు సుస్మిత బ‌ర్త్‌డే. ఈ సంద‌ర్భంగా ఆమెకు బ‌ర్త్‌డే విషెస్ తెలిపిన బాబీ.. మీరు మా చిత్రానికి మ‌రింత ఎన‌ర్జీని యాడ్ చేస్తున్నారు అంటూ ప్ర‌శంసలు కురిపించారు. దీంతో ఇప్పుడీయ‌న ట్వీట్ కాస్త నెట్టింట వైర‌ల్‌గా మారింది. చిరంజీవి గత చిత్రమైన‌ `సైరా నరసింహారెడ్డి`కి కూడా సుస్మిత కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసి మంచి మార్కులే వేయించుకుంది. మ‌ళ్లీ ఇప్పుడు తండ్రి సినిమా కోసం ప‌ని చేసే అవ‌కాశాన్ని అందుకుంది.

కాగా, చిరంజీవి ఇత‌ర సినిమాల విష‌యానికి వ‌స్తే.. ఇప్ప‌టికే ఈయ‌న నటించిన `ఆచార్య‌` చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. అలాగే మ‌రోవైపు ఈయ‌న మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వంలో `గాడ్ ఫాద‌ర్‌`, మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో `భోళా శంక‌ర్‌` చిత్రాలు చేస్తున్నాడు. ప్ర‌స్తుతం ఇవి రెండు కూడా సెట్స్ మీదే ఉన్నాయి.

author avatar
kavya N

Related posts

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Brahmamudi April 24 2024 Episode 392: గుడిలో అనామిక రచ్చ.. అనామిక మీద ఫైరైన కనకం.. రుద్రాణి ప్లాన్ ను తిప్పి కొట్టాలనుకున్న అప్పు..

bharani jella

 Trinayani April 24 2024 Episode 1221: గాయత్రి జాడ తెలుసుకోవాలనుకున్న తిలోత్తమ, అద్దంలో కనపడిన హాసిని..

siddhu

Naga Panchami: గుడిలో ఉన్న పంచమి మోక్షకు కనిపిస్తుందా లేదా.

siddhu

Kumkuma Puvvu: ట్రస్ట్ మెంబర్ పంపించిన ఫోటోలని శాంభవి చూస్తుందా లేదా.

siddhu

Nuvvu Nenu Prema April 24 2024 Episode 606: అక్క ఆచూకీ కోసం విక్కీ ఆరాటం.. అరవింద,కృష్ణ దగ్గర ఉందని తెలుసుకున్న దివ్య.. విక్కీ పద్మావతిల ఆనందం..

bharani jella

Krishna Mukunda Murari April 24 2024 Episode 453: మురారి మనసు మార్చిన ముకుంద.. కృష్ణ కి దూరంకానున్న మురారి..ఆదర్శ్ లవ్ ప్రపోజల్..

bharani jella

Vijay Devarakonda: రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో ప్రశాంత్ నీల్ మూవీ..?

sekhar

Pushpa 2: అల్లు అర్జున్ “పుష్ప 2” నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్..!!

sekhar

Zwigato OTT: థియేటర్లలో విడుదలైన రెండు నెలలకు ఓటీటీలోకి వచ్చేస్తున్న కపిల్ శర్మ అవార్డు విన్నింగ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Hanuman Tv contest: టీవీలో హనుమాన్ సెల్ఫీ కాంటెస్ట్.. విజేతలకు దిమ్మ తిరిగే గిఫ్ట్స్..!

Saranya Koduri

Jai Hanuman New Poster: హనుమాన్ జయంతి సందర్భంగా సరికొత్త పోస్టర్ను రిలీజ్ చేసిన జై హనుమాన్ టీం.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 232024 Episode 218: ఆయన అంటే నీకు ఇష్టమేనా అంటున్న అరుంధతి, ఆయనతో పెళ్లి నా అదృష్టం అంటున్న భాగమతి..

siddhu

Malli Nindu Jabili April 23 2024 Episode 630: పిల్లల కోసం హాస్పిటల్ కి వెళ్లిన అరవింద్ మాలినికి షాకింగ్ న్యూస్..

siddhu

Paluke Bangaramayenaa April 23 2024 Episode 208: ఆడది పుడితే అప్పుగా కనిపిస్తుందా ఈ సృష్టిని ప్రతి సృష్టి చేసేది ఆడదేరా అంటున్న నాగరత్నం..

siddhu