NewsOrbit
సినిమా

అంచనాలను పెంచేలా సైరా మేకింగ్


మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం `సైరా నరసింహారెడ్డి`. రెండేళ్లకు పైగానే ఈ సినిమా కోసం మెగాభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మారుతున్న తెలుగు సినిమాలకు అనుగుణంగా మెగాస్టార్ రూట్ మార్చి చేసిన హిస్టారికల్ మూవీయే `సైరా నరసింహారెడ్డి`. బ్రిటీష్ పాలనకు ఎదురొడ్డి నిలిచిన తొలి స్వాతంత్ర్య యోధుడు ఎవడ్రా అంటే మన తెలుగువాడు అని రొమ్ములు విరిచి నిలిచేలాంటి ఓ కథ.. చరిత్ర మరుగున పడిపోయిన వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితగాథను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సురేందర్ రెడ్డి దర్శకుడు. చిరంజీవి తనయుడు రామ్‌చరణ్ నిర్మాత కావడం మరో ప్లస్ అయ్యింది. ఎలాంటి లెక్కలు లేకుండా ఈ సినిమాను నిర్మించడానికి రెడీ అయ్యారు రామ్‌చరణ్. పెరుగుతున్న తెలుగు సినిమా స్పాన్‌కు అనుగుణంగా తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో సినిమాను విడుదల చేయబోతున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలను పూర్తి చేసుకుంటోంది. అక్టోబర్ 2న సినిమాను విడుదల చేస్తారనే వార్తలు వినపడుతున్నాయి.

ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ సినిమా మేకింగ్ వీడియోను నిర్మాణ సంస్థ విడుదల చేసింది. యాక్షన్ సన్నివేశాలను ఎలా చిత్రీకరించారనేదే ప్రధానంగా ఈ టీజర్ ఉంది. రామ్ లక్ష్మణ్, గ్రెగ్ పావెల్, లీ విట్టాకర్ నేత‌ృత్వంలో యాక్షన్ పార్ట్‌ను చిత్రీకరించారు. అలాగే సినిమాలో నటించిన అమితాబ్ బచ్చన్, కిచ్చాసుదీప్, విజయ్ సేతుపతి, తమన్నా, నిహారిక, జగపతిబాబు, రవికిషన్ పాత్రలకు సంబంధించిన లుక్స్‌ను కూడా ఈ యాక్షన్ టీజర్‌లో విడుదల చేశారు. అలాగే చిరంజీవి పుట్టినరోజు(ఆగస్ట్ 22) సందర్భంగా టీజర్‌ను ఆగస్ట్ 20న విడుదల చేయబోతున్నట్లు ఈ టీజర్‌లో చెప్పారు.

author avatar
Siva Prasad

Related posts

Zwigato OTT: థియేటర్లలో విడుదలైన రెండు నెలలకు ఓటీటీలోకి వచ్చేస్తున్న కపిల్ శర్మ అవార్డు విన్నింగ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Hanuman Tv contest: టీవీలో హనుమాన్ సెల్ఫీ కాంటెస్ట్.. విజేతలకు దిమ్మ తిరిగే గిఫ్ట్స్..!

Saranya Koduri

Jai Hanuman New Poster: హనుమాన్ జయంతి సందర్భంగా సరికొత్త పోస్టర్ను రిలీజ్ చేసిన జై హనుమాన్ టీం.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 232024 Episode 218: ఆయన అంటే నీకు ఇష్టమేనా అంటున్న అరుంధతి, ఆయనతో పెళ్లి నా అదృష్టం అంటున్న భాగమతి..

siddhu

Malli Nindu Jabili April 23 2024 Episode 630: పిల్లల కోసం హాస్పిటల్ కి వెళ్లిన అరవింద్ మాలినికి షాకింగ్ న్యూస్..

siddhu

Paluke Bangaramayenaa April 23 2024 Episode 208: ఆడది పుడితే అప్పుగా కనిపిస్తుందా ఈ సృష్టిని ప్రతి సృష్టి చేసేది ఆడదేరా అంటున్న నాగరత్నం..

siddhu

Madhuranagarilo April 23 2024 Episode 345:  శ్యామ్ కి వార్నింగ్ ఇచ్చినా రుక్మిణి, భిక్షు చేతిలో రుక్మిణి బలవుతుందా లేదా..

siddhu

Mamagaru April 23 2024 Episode 193: గంగని వెళ్లిపొమ్మంటున్న చంగయ్య, దర్శనం అయిందా గంగ అంటున్నా పవన్..

siddhu

Guppedanta Manasu April 23 2024 Episode 1057: మహేంద్ర శైలేంద్ర పిలిచిన చోటికి వెళతాడా లేదా.

siddhu

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే.‌.. గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Manasu Mamatha: మనసు మమత సీరియల్ ఫేమ్ ప్రీయతమ్ చరణ్ విడాకులకి కారణమేంటో తెలుసా..!

Saranya Koduri

Actress: అంగరంగ వైభోగంగా సీరియల్ నటి పెళ్లి…ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Tarun: హీరో తరుణ్ ఒక్కసారిగా సినిమాలు ఆపేయడానికి కారణం ఇదా?.. బయటపడ్డ సీక్రెట్..!

Saranya Koduri

Shoban Babu: శోభన్ బాబు కొడుకును ఇండస్ట్రీకి రాకుండా ఆపింది ఎవరో తెలుసా..!

Saranya Koduri

Leave a Comment