మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్రలో నటించిన చిత్రం `సైరా నరసింహారెడ్డి`. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితగాథను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అక్టోబర్ 2న విడుదలైన ఈ చిత్రం మంచి హిట్ టాక్‌తో రెండు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి చేరినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ప్రపంచ వ్యాప్తంగా రూ.81 కోట్ల రూపాయలను రాబట్టుకున్న ఈ చిత్రం రెండో రోజునే ఈ మార్కు అందుకోవడం విశేషం. తొలిరోజునే అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా సైరా చిత్రం ఐదో స్థానంలో నిలిచింది. ఇతర భాషల్లో సైరాకు పెద్దగా ప్రాధాన్యత దక్కలేదని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం సినిమాకు మంచి ఆదరణ దక్కుతుంది. సమాచారం ప్రకారం మూడురోజుల్లో సినిమా రూ.77.61కోట్ల షేర్‌ను రాబట్టుకుంది. రూ.100కోట్ల మార్క్‌ను దాటుతున్న చిరంజీవి రెండో చిత్రమిది.
previous post
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!