Taapsee: తాప్సీ.. ఈ పేరుకు కొత్తగా పరిచయాలు అవసరం లేదు. మంచు మనోజ్ హీరోగా కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన `ఝుమ్మందినాదం` చిత్రంలో సినీ రంగప్రవేశం చేసిన తాప్సీ.. `మిస్టర్ పర్ఫెక్ట్`తో మంచి విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత వీర, మొగుడు, బలుపు, గుండెల్లో గోదారి, సాహసం ఇలా పలు చిత్రాలు చేసి టాలీవుడ్లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది.
అయితే కొత్త హీరోయిన్ల రాక వల్ల ఇక్కడ అవకాశాలు తగ్గుతుండడంతో.. తాప్సీ బాలీవుడ్‌కి మఖాం మార్చేసింది. ప్రస్తుతం అక్కడ వరుస సినిమాలు చేస్తూ సత్తా చాటుతున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవలె ప్రొడ్యూసర్‌గానూ మారింది. సొంతంగా ‘ఔట్‌సైడర్స్ ఫిలిమ్స్’ అనే పేరుతో ఓ ప్రొడక్షన్ హౌస్‌ని ప్రారంభించి సినిమాలు నిర్మిస్తోంది.
ఇకపోతే ఏ విషయంలో అయినా బోల్డ్‌గా మాట్లాడే తాప్సీ.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అబ్బాయిలతో డేటింగ్ అనుభవాలను పంచుకుంది. ఈ క్రమంలోనే ఎందుకు పనికిరాని అబ్బాయిలతోనూ డేట్‌కి వెళ్లానని తాప్సీ మొహమాటం లేకుండా సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆమె మాట్లాడుతూ.. ఇప్పటి వరకు నేను చాలా మంది బాయ్ ఫ్రెండ్స్ తో డేటింగ్ కి వెళ్ళాను. వారిలో ఎందుకూ పనికిరాని బాయ్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు అంటూ బోల్డ్‌గా చెప్పుకొచ్చింది. దీంతో ఆమె కామెంట్స్ కాస్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుండగా.. వామ్మో.. వార్నాయనో.. తాప్సీ మామూల్ది కాదు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నాడు.
కాగా, ప్రస్తుతం తాప్సీ ప్రముఖ బ్యాడ్మింటన్ ఆటగాడు మాథియాస్ బోతో ప్రేమాయణం నడుపుతోంది. ఈ మ్యాటర్‌ను గతంలో బహిరంగంగానే తెలిపిన ఈ బ్యూటీ.. తమ ప్రేమను తల్లిదండ్రులు కూడా అంగీకరించారని వెల్లడించింది. మరి ఈ లవ్ బోర్డ్స్ ఎప్పుడు పెళ్లి పీటలెక్కుతారో చూడాలి.