కూలీ నెంబర్ వన్, నిన్నే పెళ్లాడతా… సినిమాలతో టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న టబు.. దాదాపు దశాబ్దం తర్వాత మళ్లీ తెలుగు సినిమా చేస్తున్నారు. అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘అల వైకుంఠపురంలో’ ఓ ప్రత్యేకమైన పాత్ర చేస్తున్నారు. టబుకు స్వాగతం చెబుతూ చిత్ర యూనిట్ రూపొందించిన వీడియో ఆకట్టుకుంటోంది. చాలా ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న టబు.. తన పాత్రకు డబ్బింగ్ చెప్పుకుంటున్నారట. ఆమె పాత్ర కచ్చితంగా అందరినీ ఆకట్టుకుంటుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఆమె పాత్రకు సంబంధించి డబ్బింగ్, లుక్స్‌పై చిత్ర యూనిట్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటుందట.
త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. పూజా హెగ్డే కథానాయిక. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం.. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. టీజర్, పాటలతో సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!