NewsOrbit
Entertainment News సినిమా

Samantha: విడాకులు గురించి మాట్లాడుతూ “పుష్ప” ఐటెం సాంగ్ పై సమంత సంచలన వ్యాఖ్యలు..!!

Share

Samantha: 2021లో సమంత .. నాగచైతన్యతో విడాకులు తీసుకోవడం తెలిసిందే. ఇద్దరు ఎవరికివారు సోషల్ మీడియాలో తాము విడిపోతున్నట్లు ప్రకటించడం అందరికి షాక్ గురిచేసింది. 2017లో వివాహం చేసుకున్న ఈ ఇరువురు నాలుగు సంవత్సరాలకే విడాకులు తీసుకోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. తెలుగు చలనచిత్ర రంగంలో ఈ జంట చూడముచ్చటగా ఉండేది. దీంతో ఇద్దరు విడాకులు తీసుకోవడానికి నిర్ణయం తీసుకోవడం చాలా మందికి బాధని కలిగించింది. ఏ కారణంగా వీరిద్దరూ విడాకులు తీసుకున్నది అనే  విషయంలో మీడియా ఇంకా చాలామంది అనేక కోణాలలో విచారణ చేసినా గాని అది వారిద్దరి మధ్య విషయమని తేలింది.

Talking about divorce, Samantha's sensational comments on Pushpa item song

ఈ విడాకులకు సంబంధించి నాగార్జున కూడా తనకి కూడా తెలియదని చెప్పటం సంచలనం కలిగించింది. అయితే విడాకులు తీసుకున్న అనంతరం అటు నాగ చైతన్య ఇటు సమంత ఎవరికివారు కెరియర్ పరంగా వరుస పెట్టి సినిమాలు చేసుకొని బిజీ అయిపోయారు. కానీ గత ఏడాది అక్టోబర్ నెలలో సమంత మయోసైటీస్ వ్యాధికి గురై మంచన పడింది. దాదాపు మూడు నెలల పాటు ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది. ఈ క్రమంలో ఒప్పుకున్న సినిమా షూటింగ్స్ మొత్తం ఆగిపోయాయి. ప్రస్తుతం వ్యాధి నుండి కోలుకున్న సమంత మళ్ళీ సినిమాలు మొదలు పెట్టడం జరిగింది. ఇదంతా పక్కన పెడితే లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూలో తన విడాకులు గురించి ఆ తర్వాత “పుష్ప” సినిమాలో చేసిన ఐటమ్ సాంగ్ గురించి కీలక వ్యాఖ్యలు చేసింది. వివాహ జీవితంలో తాను పూర్తిగా నిజాయితీగా ఉన్నట్లు చెప్పుకొచ్చింది. కాకపోతే అది వర్కౌట్ కాలేదని తెలిపింది.

Talking about divorce, Samantha's sensational comments on Pushpa item song

విడాకులు తీసుకున్న తర్వాత “పుష్ప” సినిమాలో ఊ అంటావా అనే ఐటెం సాంగ్ లో చేసే టైములో చాలామంది నుండి తనకి ఫోన్ కాల్స్ వచ్చాయని సమంత సంచలన వ్యాఖ్యలు చేసింది. తాను తప్పు చేయని సమయంలో ఎందుకు ఇంట్లో కూర్చుని బాధపడాలి..అని అనిపించింది. దీంతో “పుష్ప” సినిమా ఐటెం సాంగ్ చేయకూడదని చాలామంది కుటుంబ సభ్యులు స్నేహితులు.. ఫోన్లు చేసి… ఇంట్లో కూర్చో చాలు. విడిపోయిన వెంటనే ఐటం సాంగ్స్ చేయటం బాగోదని సలహాలు ఇచ్చారు. తన కెరియర్ లో ఎప్పుడు ప్రోత్సహించే స్నేహితుల సైతం.. ఐటెం సాంగ్స్ చేయొద్దని వాదించారు. అయితే ఆ మాటలు ఏమీ పట్టించుకోకుండా సాంగ్ చేసినట్లు సమంత తాజా ఇంటర్వ్యూలో తెలిపారు. గత రెండు సంవత్సరాలనుండి అనేక పోరాటాల గుండా వెళ్తున్నాను. ఇప్పుడు శారీరకంగా.. మానసికంగా అంతా బాగానే ఉన్నాను అని కీలక వ్యాఖ్యలు చేసింది. దీంతో విడాకుల పై సమంత చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. మరోపక్క నాగచైతన్య ఇటీవల లండన్ లో ఓ హోటల్ లో చెఫ్ తో దిగిన ఫోటోలో వెనకాల శోభిత ధూళిపాళ్ల ఉండటం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇలాంటి సమయంలో సమంత విడాకులు గురించి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి.


Share

Related posts

బీజేపీ అగ్రనేత అమిత్ షాతో సమావేశం కానున్న టాలీవుడ్ అగ్రనటుడు జూనియర్ ఎన్టీఆర్.. ఎందుకంటే..?

somaraju sharma

“తాతామనవళ్ళ” స్టోరీ లైన్ తో ప్రభాస్ కొత్త సినిమా..??

sekhar

Namrata-Saiee Manjrekar: మ‌హేశ్ భార్య‌తో `మేజ‌ర్‌` హీరోయిన్‌కు ఉన్న రిలేష‌న్ ఏంటో తెలుసా?

kavya N