RC15: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కెరియర్ పరంగా మంచి టైం నడుస్తుంది. వరుసపెట్టి బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటున్నాడు. ఇటీవలే “RRR”తో మరోసారి ఇండస్ట్రీ హిట్ అందుకోవటం మాత్రమే కాదు… ఓవరాల్ గా తన మార్కెట్ మరింతగా విస్తరించేలా చరణ్ రాణించడం జరిగింది. అంతకుముందు “రంగస్థలం” తో బ్లాక్ బస్టర్ అందుకున్న చరణ్.. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తన కెరీర్ లో పదిహేనవ సినిమా కావడంతో చరణ్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
పాన్ ఇండియా నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని టాలీవుడ్ టాప్ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. సౌత్ ఇండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్.. దర్శకత్వంలో వస్తున్న .. ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ క్రమంలో చరణ్ పదిహేనవ సినిమాకి సంబంధించి సరికొత్త అప్డేట్ తమన్ ఇవ్వటం జరిగింది. ఈ సినిమాలో ఆరు పాటలు ఉన్నాయని పేర్కొన్నారు. మొత్తం పాటలన్నీ ఫుల్ ఎనర్జిటిక్ సాంగ్స్.. పైగా పాడింది కూడా టాప్ మోస్ట్ సింగర్స్ అని తెలియజేశారు. ఆల్రెడీ మూడు పాటలకు పిక్చరైజేషన్ కూడా అయిపోయిందని తమన్ పేర్కొన్నారు.
డైరెక్టర్ శంకర్ తన స్టైల్ లో… ఆటలు చిత్రీకరించటం జరిగిందని… స్పష్టం చేశారు. ఒక బిట్ సాంగ్ ఈ సినిమాలో ఉందని అది కూడా… పిక్చరైజేషన్ ఇటీవల జరిగిందని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే త్వరలో ఈ సినిమాకి సంబంధించి చిన్నపాటి వీడియో సినిమా యూనిట్ విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. చరణ్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా తెరకెక్కుతోంది. చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. కమెడియన్ సునీల్ కూడా ఈ సినిమాలో ఉన్నారు. శంకర్ ఏ సినిమాలో రామ్ చరణ్ మూడు విభిన్నమైన పాత్రల్లో చూపిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు తెలియజేస్తున్నాయి.