Chiranjeevi Taman: “అలా వైకుంఠపురం లో” నుండి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అందిస్తున్న సాంగ్స్ లేదా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ అన్న తరహాలో ఉన్న సంగతి తెలిసిందే. అంతకుముందు తమన్ పనితనం అలా వైకుంఠపురం లో నుండి పనితనం చాలా వ్యత్యాసం కనబడుతోంది. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఇంకా చాలా సందర్భాలలో అలా వైకుంఠపురం తర్వాత.. తనదైన శైలిలో తమన్ అండ్ ది బెస్ట్ ఇస్తున్నాడు. అఖండ లో తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి హైలెట్ గా నిలిచింది. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మేజర్ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులకు తమన్ యే మ్యూజిక్ డైరెక్టర్.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
దీనిలో భాగంగా మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న “గాడ్ ఫాదర్” కి తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో.. నయనతార కీలక పాత్ర చేస్తోంది. అయితే చిరంజీవికి హీరోయిన్ లేదా చెల్లెలు పాత్ర అన్నది సస్పెన్స్ గా నెలకొంది. ఇటువంటి తరుణంలో ఇటీవల ఆహా ఓటీటీ లో.. తెలుగు ఇండియన్ ఐడిల్ షోకి … గ్రాండ్ ఫినాలే కార్యక్రమానికి చిరంజీవి చీఫ్ గెస్ట్ గా రావడం తెలిసిందే. అయితే ఈ కార్యక్రమంలో విన్నర్ కి “బోలా శంకర్” లో.. అన్నా చెల్లెలు కు సంబంధించిన సాంగ్ డాన్స్ … షో విన్నర్ కి పాడే అవకాశం కల్పించడం జరిగింది. ఈ క్రమంలో నయనతార చిరంజీవికి చెల్లెలు పాత్ర చేస్తున్నట్లు.. తమన్ ఇండైరెక్టుగా హింట్ ఇవ్వటం జరిగిందట.
ప్రారంభంలో సినిమాలో చిరంజీవి చెల్లెలు పాత్రలో హీరోయిన్ కీర్తి సురేష్ అనుకున్నట్లు టాక్ వచ్చింది. కానీ.. నయనతార నటిస్తున్నట్లు తమన్ కామెంట్లు బట్టి తేలిపోయింది. “గాడ్ ఫాదర్” సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావడం జరిగింది. ఇటీవల విదేశాల నుండి వచ్చిన చిరంజీవి ఈ సినిమాకి డబ్బింగ్ కూడా చెప్పటానికి రెడీ అయినట్లు సమాచారం. ఈ క్రమంలో ఆగస్టు నెలలో చిరంజీవి పుట్టినరోజు వస్తూ ఉండటంతో.. “గాడ్ ఫాదర్” సినిమాకి సంబంధించి.. టీజర్ రిలీజ్ చేయడానికి సినిమా యూనిట్ రెడీ అవుతోంది. ఇదే సమయంలో మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కే “బోలా శంకర్” ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు ఇండస్ట్రీ టాక్.