నేడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కావటంతో అభిమానులు ఫుల్ సందడి చేస్తున్నారు. తమ అభిమాన నాయకుడు మరియు హీరో జన్మదినం సందర్భంగా ప్రత్యేకమైన పాట కూడా తీర్చిదిద్దడం జరిగింది. “ఒక పవనమై.. ఒక పిడికిలై.. ఒక సేనవై రా .. మనల్ని ఎవడ్రా ఆపేది.. మనని ఎవడు ఆపేది.. మనల్ని ఎవడ్రా ఆపేది” అంటూ ఓ సాంగ్ రూపొందించడం జరిగింది. ఇప్పుడు ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇదిలా ఉంటే పవన్ పుట్టినరోజు నేపథ్యంలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ వెరైటీ కామెంట్ తో విష్ చేశారు.
“జన్మదిన శుభాకాంక్షలు సార్” మీది.. కల్మషం లేని హృదయం. నిండు నూరేళ్లు వర్ధిల్లు నాయకుడా అని.. పవన్ కళ్యాణ్ తో దిగిన ఫోటో షేర్ చేయడం జరిగింది. అంతేకాకుండా సోషల్ మీడియా డిపిగా తమన్.. పవన్ ఫోటో పెట్టుకోవటం సంచలనం లేపింది. పవన్ రాజకీయాలనుండి సినిమా రంగంలోకి రియంట్రిచాగా నటించిన రెండు సినిమాలకు తమన్ యే మ్యూజిక్ డైరెక్టర్. వకీల్ సాబ్, బీమ్లా నాయక్ రెండు సినిమాలకు తమన్ అందించిన సంగీతం సినిమాలకే హైలెట్ గా నిలిచింది.
ఇక పవన్ పుట్టినరోజు సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలలో నిన్న మొన్నటి వరకు “తమ్ముడు” సినిమాలు స్పెషల్ షోస్ వేయగా..ఇప్పుడు “జల్సా” షోలు పడ్డాయి. అభిమానులు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఇదే పవన్ బర్త్ డే కానుకగా ఫ్యాన్స్ పలు సేవ కార్యక్రమాలు చేస్తున్నారు. ఈరోజు పవన్ కొత్త సినిమాలకు సంబంధించి అప్ డేట్ కోసం మరోపక్క ఎదురుచూస్తూ ఉన్నారు ఫ్యాన్స్.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!