తమన్నా నెగటివ్ రోల్లో కనిపించనుందా? ఈ మధ్య నెట్టింట్లో ఈ విషయాలే హల్చల్ చేశాయి. కానీ అందులో నిజం లేదని తమన్నా తరఫు వారు తేల్చేశారు. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చారిత్రాత్మక చిత్రం `సైరా`లో తమన్నా లక్ష్మీ అనే పాత్ర పోషిస్తోంది. లక్ష్మీ పాత్రకు నరసింహారెడ్డికి సంబంధం ఏంటనేదాని మీద చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వలేదు. రాణి పాత్రను నయనతార పోషిస్తుండటంతో తమన్నా పాత్ర నెగటివ్‌గా ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ ఇందులో తమన్నాది నెగటివ్ రోల్ కాదట. చాలా చాలా కీలకమైన పాత్ర అని వినికిడి. ఈ చిత్రంలో వీరితోపాటు రాజగురువు పాత్రలో అమితాబ్ బచ్చన్ నటిస్తున్నారు. కన్నడ నుంచి సుదీప్, తమిళ్ నుంచి విజయ్ సేతుపతి కూడా కీలక పాత్రల్లో నటించారు. చిత్రీకరణ దాదాపుగా పూర్తయింది. కొంత ప్యాచ్ వర్క్ మాత్రం మిగిలి ఉంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ ఆఫీసులోనే జరుగుతోంది. చిరంజీవి స్వయంగా అన్నిటినీ పర్యవేక్షిస్తున్నారట. అక్కడే తిండీ, అక్కడే విశ్రాంతి తీసుకుంటున్నారని సమాచారం. చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకుని ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ చిత్రానికి రామ్‌చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కొణిదెల సురేఖ సమర్పిస్తున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఇలాంటి చారిత్రక పాత్రను పోషించడం చిరంజీవికి ఇదే తొలిసారి కావడం గమనార్హం.
previous post
next post