సినిమా

Tamannaah: త‌మ‌న్నా ధ‌రించిన ఆ లెదర్ డ్ర‌స్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

Share

Tamannaah: తమన్నా భాటియా.. ఈ పేరుకు కొత్త‌గా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ముంబైలో జ‌న్మించిన ఈ మిల్కీ బ్యూటీ.. మంచు మనోజ్ హీరోగా దశరథ్ దర్శకత్వంలో తెర‌కెక్కిన `శ్రీ‌` సినిమాతో హీరోయిన్‌గా కెరీర్ స్టార్ట్ చేసింది. ఆ త‌ర్వాత వ‌రుస సినిమాలు చేసిన త‌మ‌న్నా.. టాలీవుడ్‌ను ఓ ఊపు ఊపేసింది.

గత దశాబ్దం కాలం నుంచీ త‌న‌దైన న‌ట‌న‌తో పాటు గ్లామర్, డాన్స్ పరంగానూ ప్రేక్ష‌కుల‌ను అల‌రించిన త‌మ‌న్నా.. కొత్త భామల రాక వ‌ల్ల సీనియ‌ర్ హీరోల సినిమాల్లోనే అవ‌కాశాలు అందుకుంటోంది. ఇదిలా ఉంటే.. తాజాగా త‌మ‌న్నా అమెజాన్‌ ప్రైమ్‌ నిర్మిస్తున్న వెబ్‌ సిరీస్ `జీ కర్దా` ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో పాల్గొంది.

అక్క‌డ అంద‌రి చూపులు త‌మ‌న్నా పైనే ప‌డ్డాయి. అందుకు కార‌ణం లేక‌పోలేదు.. ఆమె స్కై బ్లూ క‌ల‌ర్ లెదర్ డ్రెస్ ను ధ‌రించి సూప‌ర్ హాట్‌గా మెరిసింది. అయితే ఇప్పుడు త‌మ‌న్నా ఫొటోలే కాదు.. ఆమె ధ‌రించిన డ్ర‌స్ ఖ‌రీదు కూడా నెట్టింట వైర‌ల్‌గా మారాయి. స్కై బ్లూ కలర్‌లో మోకాళ్ల పైకి ఉన్న ఆ డ్ర‌స్ ఖ‌రీదు ఎంతో తెలుసా.. అక్ష‌రాలా రూ.2,69,121. అంతేకాదండోయ్‌.. ఆ లెద‌ర్‌ డ్ర‌స్‌కు మ్యాచింగ్‌గా త‌మ‌న్నా వేసుకున్న చెప్పుల ఖరీదు రూ.90,800.

దీంతో ఒక డ్ర‌స్‌, చెప్పుల కోసం త‌మ‌న్నా ఇంత ఖర్చు చేసిందా అని కొంద‌రు క‌ళ్లు తేలేస్తుంటే.. సెల‌బ్రెటీల‌కు ఇది కామ‌న్‌నే అంటూ మ‌రికొంద‌రు లైట్‌గా తీసుకున్నారు. కాగా, సినిమాల విష‌యానికి వ‌స్తే.. ప్ర‌స్తుతం మెహ‌ర్ ర‌మేశ్ ద‌ర్శ‌క‌త్వంలో మెగాస్టార్ చిరంజీవికి జోడీగా `భోళా శంక‌ర్`, అనిల్ రావిపూడి డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కుతున్న `ఎఫ్ 3`, వ‌ర్సిటైల్ యాక్ట‌ర్ స‌త్య‌దేవ్‌తో `గుర్తుందా శీతాకాలం`చిత్రాల్లో న‌టిస్తోంది. బాలీవుడ్ లో `బోలే చుడియాన్`, `ప్లాన్ ఏ ప్లాన్ బీ` చిత్రాలు చేస్తోంది. అలాగే బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు మ‌ధుర్ భండార్క‌ర్ దర్శకత్వంలో `బబ్లీ బౌన్సర్` అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాకు సైతం చేసిన త‌మ‌న్నా.. ప‌లు వెబ్ సిరీస్‌లోనూ న‌టిస్తోంది.

 


Share

Related posts

Bheemla Naayak: జస్ట్ మూడు రోజుల్లోనే సరికొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేసిన “బీమ్లా నాయక్”..!!

sekhar

బిగ్ బాస్ 4 : టీఆర్పీ కోసం బిగ్ బాస్ ప్లే చేసిన ట్రిక్ చూడండి…?

arun kanna

Sarkaru vaari paata : సర్కారు వారి పాట రికార్డుల వేట మొదలు..ఈసారీ బాక్సాఫీస్ వద్ద కొత్త లెక్కలే

GRK
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar