Tamannaah: మిల్కీ బ్యూటీ తమన్నా అంటే తెలియని వారుండరు. `శ్రీ` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అందాల భామ.. అంచలంచలుగా ఎదుగుతూ స్టార్ స్టేటస్‌ను దక్కించుకుంది. ఇండస్ట్రీలోకి 15 ఏళ్లు కావొస్తున్నా.. తన ఫామ్‌ను మాత్రం కోల్పోకుండా వరుస సినిమాలు, వెబ్ సిరీస్‌లు మరియు స్పెషల్ సాంగ్స్ చేస్తూ దూసుకుపోతోంది.
నటన పరంగానే కాదు స్కిన్ షో విషయంలోనూ ఎన్నో సార్లు బౌండరీలు దాటేసి.. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ఇకపోతే ఈ బ్యూటీ లాంగ్ గ్యాప్ తర్వాత వెకేషన్ కోసం మాల్దీవులకు చెక్కేసింది. అక్కడ ఈమె చేసే రచ్చ అంతా ఇంతా కాదు. తాజాగా అయితే పింక్ టూపీస్ బికినీ ధరించి పరువాల విందుతో కుర్రాళ్లకి నిద్ర లేకుండా చేస్తుంది
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారగా.. వాటిని చూసిన నెటిజన్లు సమ్మర్లో తమన్నా మరింత హీట్ పెంచుతోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక టూపీస్ బికినీ లు తమన్నాకి కొత్తేం కాదు. గతంలో చాలాసార్లు స్విమ్ షూట్లలో కుర్రాళ్ళకు ఫుల్ మీల్స్ పెట్టింది.
కాగా, తమన్నా సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈమె అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కుతున్న `ఎఫ్ 3` సినిమాలో ఒక హీరోయిన్గా నటిస్తోంది. చిరంజీవి సరసన `భోళా శంకర్`, సత్యదేవ్‌తో `గుర్తుందా శీతాకాలం` నటించేందుకు కమిట్ అయింది. అలాగే వరుణ్ తేజ్ `గని`లో ఐటెం సాంగ్ చేసిన తమన్నా.. బాలీవుడ్ లో `బోల్ చుడాయాన్`, `ప్లాన్ ఏ ప్లాన్ బి`, `బాబ్లీ బౌన్సర్` చిత్రాలు చేస్తోంది.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!