Tamannaah: మిల్కీ బ్యూటీ తమన్నా గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. `శ్రీ` సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. తనదైన టాలెంట్, గ్లామర్ షోతో స్టార్ హీరోయిన్గా గుర్తింపు సంపాదించుకుంది. ఇండస్ట్రీలోకి వచ్చి పదిహేనేళ్లు అవుతున్నా.. తన స్టార్‌డమ్‌ను కోల్పోకుండా కెరీర్ పరంగా ఫుల్ స్వింగ్‌లో దూసుకుపోతోంది.
ప్రస్తుతం తమన్నా సినిమాలు మాత్రమే కాదు.. వెబ్ సిరీస్‌లు, ఐటెం సాంగ్స్ కూడా చేస్తూ మస్తు బిజీగా గడుపుతోంది. అయితే ఎప్పుడూ ట్రెండీ డ్రస్సులతో సూపర్ స్టైలిష్‌గా కనిపించే తమన్నా.. తాజాగా మాత్రం ఊర మాస్ లుక్‌లో దర్శనమిచ్చింది. ఏదో సినిమా కోసం తమన్నా వేసుకున్న కాస్ట్యూమ్ అని అర్థం అవుతోంది.
లైట్ బ్లూ కలర్ జీన్స్, బ్రౌన్ కలర్ షర్ట్‌ను ధరించిన తమన్నా.. క్యారీ వ్యాన్ దిగుతూ ఎవరితోనో ఫోన్లో సీరియస్ డిస్కర్షన్ చేస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. వాటిని చూసిన నెటిజన్లు వామ్మో తమన్నా ఏంటి ఇలా మారిపోయింది..? అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.
మరి లేటెందుకు షాకిస్తున్న తమన్నా లేటెస్ట్ లుక్స్‌పై మీరు లుక్కేసేయండి. కాగా, సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈ బ్యూటీ అనిల్ రావిపూడి దర్శకత్వంలో `ఎఫ్ 3`, మధుర్ భండార్కర్ డైరెక్షన్లో `బబ్లీ బౌన్సర్` అనే చిత్రాల్లో నటిస్తోంది. అలాగే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన `గని`లో ఐటెం సాంగ్ చేసింది.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!