Tamannaah: మిల్కీ బ్యూటీ తమన్నా గురించి పరిచయాలు అక్కర్లేదు. 2005లో వచ్చిన `శ్రీ` అనే సినిమాతో టాలీవుడ్లోకి అడుగు పెట్టిన ఈ అందాల భామ.. తనదైన నటన, గ్లామర్‌తో అనతి కాలంలో స్టార్ హీరోయిన్ గుర్తింపు పొందింది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ మరియు హిందీ భాషల్లోనూ నటించిన తమన్నా.. ఇండస్ట్రీలోకి వచ్చిన పదిహేనేళ్లు అయిపోయినా ఇంకా బిజీ హీరోయిన్గా గడుపుతోంది.
ఇదిలా ఉంటే.. తమన్నా ఈ మధ్య కాస్త బొద్దుగా మారిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు పెరిగిన బరువు తగ్గించుకోవడం కోసం తమన్నా జిమ్‌లో కసర్తులు చేస్తూ చెమటలు చిందిస్తోంది. ట్రైనర్ పర్యవేక్షణలో కసరత్తులు చేస్తున్న వీడియోను తాజాగా తమన్నా ట్విట్టర్ లో షేర్ చేశారు. దీంతో ఈ వీడియో కాస్త నెట్టింట వైరల్‌గా మారింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఈ వీడియో చూసిన నెటిజన్లు.. జిమ్‌లో తమన్నా వర్కౌట్స్ చేస్తుంటే.. ఇక్కడ మాకు చెమటలు పడుతున్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా, సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం మెహర్ రమేశ్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి సరసన `భోళా శంకర్`లో నటిస్తున్న తమన్నా.. త్వరలోనే `ఎఫ్ 3`తో ప్రేక్షకులను పలకరించబోతోంది. వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్లో రూపుదిద్దుకున్న ఈ చిత్రం మే 27న రిలీజ్ కానుంది.
అలాగే వర్సిటైల్ యాక్టర్ సత్యదేవ్‌తో `గుర్తుందా శీతాకాలం`అనే చిత్రం చేస్తోంది. ఇక బాలీవుడ్ లో `బోలే చుడియాన్`, `ప్లాన్ ఏ ప్లాన్ బీ` చిత్రాలు చేస్తోంది. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు మధుర్ భండార్కర్ దర్శకత్వంలో `బబ్లీ బౌన్సర్` అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాకు సైతం తమన్నా సైన్ చేసింది.
Miss B and her beliefs #MissB pic.twitter.com/z3SoKkp7Su
— Tamannaah Bhatia (@tamannaahspeaks) May 6, 2022
Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!