తమన్నా సినిమాల కంటే.. వార్తల్లోనే నిలవడానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ హృతిక్‌తో తప్ప మరేవరితోనైనా లిప్ లాక్ చేయడానికి ఇష్టపడనని.. ఆయనతో మాత్రమే లిప్ లాక్ చేయడానికి ఇష్టపడతానని చెప్పిన తమన్నా ఇప్పుడు మరో బాంబ్ పేల్చింది. ఇటీవల మరో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎవరితో అయినా డేటింగ్ వెళ్లాలంటే ఎవరితో వెళతారు అని అడిగిన ప్రశ్నకు విక్కీ కౌశల్ అని తడుముకోకుండా జవాబిచ్చిందీ మిల్కీ బ్యూటీ. ఈ అమ్మడు ఉరి: ది సర్జికల్ స్ట్రయిల్ సినిమా చూసినప్పటి నుండి విక్కీ కౌశల్ అంటే ఇష్టం ఏర్పడిందని కూడా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తమన్నా.. తెలుగులో సైరా నరసింహారెడ్డి, దటీజ్ మహాలక్ష్మితో పాటు అభినేత్రి 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది.
previous post
next post