Meena: గత ఏడాది హీరోయిన్ మీనా భర్త విద్యాసాగర్ పోస్ట్ కోవిడ్ సమస్యలతో బాధపడుతూ చెన్నై ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ మరణించడం తెలిసిందే. ఆ తర్వాత కొద్ది నెలల నుండి సీనియర్ హీరోయిన్ మీనా రెండో పెళ్లి గురించి రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తాను అప్పట్లో ఓ హీరోని ప్రేమించినట్లు.. ఆ విషయం మాత్రం చెప్పేలోపు అతని పెళ్ళని తెలిసి గుండె బద్దలైందని సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. పరిస్థితి ఇలా ఉంటే తమిళ నటుడు రంగనాథన్… సీనియర్ హీరోయిన్ మీనా రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఓ 39 సంవత్సరాల పాన్ ఇండియా స్టార్ నటుడితో వివాహం చేసుకోవడానికి మీనా రెడీ అవుతున్నట్లు పేర్కొన్నారు. ఇంత బేయిల్వన్ రంగనాథన్ చేసిన వ్యాఖ్యలు.. సంచలనంగా మారాయి. సోషల్ మీడియా డిస్కషన్ కీ దారితీసాయి. దీంతో వెంటనే.. మీనా స్పందించి వస్తున్నా వార్తలలో వాస్తవం లేదని రంగనాథన్ కామెంట్లను ఖండించింది. ఇదే సమయంలో మీనా అభిమానులు సైతం ఫైర్ అయ్యారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమా ఎంట్రీ ఇచ్చిన మీనా… మొదట తమిళంలో సినిమాలు చేయడం జరిగింది. ఆ తర్వాత హీరోయిన్ గా తెలుగులో ఫస్ట్ సినిమా రాజేంద్రప్రసాద్ తో చేసింది.
అప్పటి నుండి దాదాపు దశాబ్ద కాలం పాటు దక్షిణాది చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. అప్పట్లో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో టాప్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున లతో సినిమాలు చేయడం జరిగింది. ఇంక చాలామంది హీరోలతో కూడా చేసి.. 2009లో పెళ్లయ్యాక సినిమా ఇండస్ట్రీకి దూరమైంది. అయితే ప్రస్తుతం తన తోటి హీరోయిన్లు అప్పట్లో.. స్టార్ హీరోయిన్ లుగా పేరు తెచ్చుకున్న వాళ్ళు ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తూ ఉండటంతో మీనా కూడా సరైన అవకాశం కోసం ఎదురుచూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆల్రెడీ వెంకటేష్ తో దృశ్యం సినిమాలో కీలక పాత్ర పోషించింది. ఆ తరహాలోనే మారినీ అవకాశాలు కోసం ఎడురుచుస్తున్నట్లు సమాచారం.