`నేను మ్యూజిక్‌ను పిండుకున్నాను. అందుకే అంత మ్యూజిక్‌ను దేవిశ్రీ ఇచ్చాడు` అని ఓ సందర్భంలో దేవిశ్రీప్రసాద్‌ను కామెంట్ చేసిన బోయపాటికి తర్వాత దేవిశ్రీ కౌంటర్ ఇచ్చాడు. ఈ సంగతిని పక్కన పెడితే ఇప్పటి వరకు తెలుగు మ్యూజిక్ డైరెక్టర్స్ నుండే రసం పిండుకున్న(బోయపాటి భాషలో చెప్పాలంటే) ఈ స్టార్ డైరెక్టర్ ఇప్పుడు తమిళ మ్యూజిక్ డైరెక్టర్‌పై మనసు పడ్డాడు. ఇంతకు బోయపాటి మనసుపడ్డ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో తెలుసా? కోలీవుడ్ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్. ఇప్పటి వరకు బోయపాటి సినిమాలకు ఐతే దేవిశ్రీ ప్రసాద్ లేకుంటే తమన్ సంగీతం అందించాడు. తొలిసారి మరో సంగీత దర్శకుడు.. అది కూడా తమిళ దర్శకుడితో బోయపాటి శ్రీను సినిమా చేయబోతున్నాడని వస్తున్న వార్తల్లో నిజా నిజాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
previous post