Samantha: సమంతపై తమిళుల ఆగ్రహం..! సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్స్

tamilians anger on samantha
Share

Samantha: సమంత Samantha సౌత్ ఇండియా సూపర్ స్టార్ హీరోయిన్. పెళ్లై నాలుగేళ్లు అవుతున్నా ఆమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. పెళ్లయ్యాకే ఆమె కెరీర్లో రంగస్థలం లాంటి సినిమా పడింది. ఓబేబీ.. మజిలీ వంటి సినిమాలు ఆమెకు బోనస్. ఆమె కెరీర్లో ఫ్లాపుల కంటే హిట్లు ఎక్కువ. అంతటి సక్సెస్ పర్సంటేజ్ ఆమె సొంతం. ఇలా ఆచితూచి సినిమాలు చేస్తూ సక్సెస్ ఫుల్ గా రాణిస్తున్న సమంత ప్రస్తుతం వివాదంలో చిక్కుకుంది. ఇందుకు కారణం ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ సిరీస్. ఇందులో ఆమె ఈలం తమిళ టెర్రరిస్టుగా నటించింది. ఇప్పుడు ఆమెపై తమిళ ప్రజల్లో ఆగ్రహం నెలకొంది. ఇప్పుడు ఏకంగా ఆమెను సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.

tamilians anger on samantha
tamilians anger on samantha

జూన్ 4న ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది. దీంతో తమిళులు సమంతపై ఆగ్రహం మండిపడుతున్నారు. ఇందుకు సోషల్ మీడియాను వేదికగా ఎంచుకున్నారు. ఇప్పటివరకూ #HateSamantha, #FamilyMan2AgainstTamils.. అనే హ్యాష్ ట్యాగ్స్ రన్ అయితే.. ఇప్పుడు రూటు మార్చారు. సమంతనే టార్గెట్ చేస్తూ.. #ShameonYouSamantha అనే హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేసి తమ నిరసన తెలియజేస్తున్నారు. డైరక్ట్ గా సమంత ఫొటో పెట్టి ఈ సిరీస్ లో టెర్రరిస్ట్ పాత్రలో నటించడం ఎంత వరకూ సబబు అంటూ మండిపడుతున్నారు. అయితే.. ఇంత ఎపిసోడ్ లో సమంత మాత్రం బయటకు రాలేదు. ఒక్క మాటా మాట్లాడలేదు.

Read More:Tamil Nadu: The Family Man-2: తమిళులు పట్టు పడితే అంతే..! ఫ్యామిలీ మ్యాన్2 పరిస్థితేంటో..!?

మరోవైపు.. ఇంకొక్క రోజులో సినిమా విడుదల కానుంది. ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ ను రద్దు చేయాలంటూ తమిళ ప్రభుత్వం కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ కు లేఖ కూడా రాశారు. శ్రీలంకలో తమిళుల హక్కుల కోసం పోరాడిన తమిళులు టెర్రరిస్టులుగా చూపడం తమిళులను అవమానించడమే అంటూ లేఖలో పేర్కొన్నారు. అయితే.. ఇంకా దీనిపై కేంద్రం నిర్ణయం తీసుకోలేదు. దీనిపై వెబ్ సిరీస్ దర్శకులు రాజ్ & డీకే, హీరో మనోజ్ బాజ్ పేయి స్పందిస్తూ.. రెండు నిమిషాల ట్రైలర్ చూసి కాదు.. సినిమా చూసి చెప్పండి. తమిళులకు గర్వకారణంగా నిలుస్తందని కూడా క్లారిటీ ఇచ్చారు. మరి.. సమంత ఇప్పటికైనా రియాక్ట్ అవతుందో.. వెబ్ సిరీస్ విడుదలపై కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

 

 

 


Share

Related posts

విడుద‌లకు సిద్ధ‌మ‌వుతున్న `హిప్పీ`

Siva Prasad

మీకో దండం న‌న్ను వ‌దిలేయండి అంటున్న సినీ నిర్మాత.. ఎందుకో తెలుసా?

Teja

Anasuya Bharadwaj Amazing Photos

Gallery Desk