Tammareddy Bharadwaja: ఇటీవల టాలీవుడ్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ RRR కీ ఆస్కార్ రావాలని ఆ సినిమా యూనిట్ 80 కోట్లు ఖర్చు చేయడంపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో కాంట్రవర్సీగా మారాయి. ఈ క్రమంలో మెగా బ్రదర్ నాగబాబు.. తమ్మారెడ్డి భరద్వాజ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో మండిపడటం జరిగింది. “నీ** మొగుడు ఖర్చు పెట్టాడారా 80 కోట్లు RRR కీ ఆస్కార్ కోసం” అంటూ “RRR మీద కామెంట్ కు వైసీపీ వారి భాషలో సమాధానం” అని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఏంటో నాగబాబు తనపై చేసిన వ్యాఖ్యలకు దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు.
తాను సినిమా ఇండస్ట్రీకి ఎప్పుడు కూడా జవాబు దారితనంగా ఉంటానని చెప్పుకొచ్చారు. తానేమి తప్పు చేయలేదని.. క్షమాపణ చెప్పనన్నారు. సెమినార్ లో తాను చేసిన వ్యాఖ్యల సమయంలో తనతో పాటు కొంతమంది చిన్న దర్శకులు స్టేజిపై ఉండటం జరిగింది. అయితే ఫిలిం ఫెస్టివల్స్ గురించి ఇంకా అవార్డులకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి వంటి విషయాలపై చర్చిస్తూ ఉన్న సమయంలో… పులిని చూసి నక్క వాతలు పెట్టుకోకూడదని.. RRR గురించి ఉదాహరణ చెప్పటం జరిగింది. కేజిఎఫ్, RRR ఇలాంటి సినిమాలు చూడొచ్చు తీయడం చాలా కష్టమని చెప్పాను. కథ నమ్మితే భారీగా తీయాలని చెబుతూ తేడాలు కూడా వివరించడం జరిగింది అనీ తమ్మారెడ్డి క్లారిటీ ఇవ్వటం జరిగింది. ఇదే సమయంలో రెండు రోజుల క్రితం RRR గురించి తాను మాట్లాడటం జరిగిందని.
ఆ సినిమా దేశానికి గర్వ కారణం అంటూ రాజమౌళి గొప్పతనాన్ని తెలియజేస్తూ వీడియో కూడా పోస్ట్ చేయడం జరిగింది. దాని గురించి ఎవరు మాట్లాడలేదు. కానీ మూడు గంటల సెమినార్ లో కొద్దిపాటి ఆడియో ఎడిటింగ్ చేసి దాని మీద నిందలు వేయటం తగదు అని అన్నారు. మీ అమ్మ మొగుడని ఒకరి నన్ను అన్నారు. నా అమ్మ మొగుడు నాకు సంస్కారం నేర్పించాడు. నాకు నీతిగా బతకడం, నిజం చెప్పడం నేర్పించాడు. మీకు నేర్పించారా? మీకు నిజం తెలుసా? నిజం చెప్పగలరా మీరు? మీరు చేసిన నిజాలేంటో చెప్తారా? మీకు హక్కుందా నా గురించి మాట్లాడటానికి?’ అని తమ్మారెడ్డి ఫైర్ అయ్యారు.