Unstoppable 2: దేశంలో అన్ని టాకీ షోలలో “అన్ స్టాపబుల్” నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఆహా ఓటీటీలో బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న ఈ షోకి వీక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ముఖ్యంగా బాలయ్య యాంకరింగ్ నీ చాలా బాగా ఆస్వాదిస్తున్నారు. ఈ షో ప్రారంభం కాకముందు కేవలం నటుడిగా మాత్రమే కొంతమందికే చేరువైన బాలయ్య ఈ షో ద్వారా… విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంటూ బాలయ్య కి యాంకరింగ్ లో కూడా తిరుగులేదని అన్ స్టాపబుల్ షో ద్వారా నిరూపించుకున్నాడు. మొదటి సీజన్ తోనే మంచి పాపులారిటీ రావడం జరిగింది.
దీంతో సెకండ్ సీజన్ నీ మరింత గ్రాండ్ గా ప్లాన్ చేయటం జరిగింది. సినిమా సెలబ్రిటీలతోపాటు రాజకీయ నాయకులు తీసుకురావడం జరిగింది. ఇటీవలే పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ కూడా వచ్చారు. ఇదిలా ఉంటే త్వరలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే ఈ ఎపిసోడ్ కి సంబంధించి షూటింగ్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఈ క్రమంలో అన్ స్టాపబుల్ షోకి పవన్ కళ్యాణ్ రావడం పట్ల… పొలిటికల్ విమర్శలు వస్తున్నాయి. దీంతో ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు.
పవన్ కళ్యాణ్ ని ప్రత్యేకంగా షో కి తీసుకొచ్చి రాజకీయం చేయడం బాలకృష్ణకి తెలియదని చెప్పుకొచ్చారు. ఉన్నది ఉన్నట్టు లోనా బయట ఏమీ లేకుండా మొహం మీద చెప్పే మనస్తత్వం బాలయ్యది అని అన్నారు. అంతేకాదు చంద్రబాబుతో నేరుగానే పవన్ కళ్యాణ్ కి సంబంధాలు ఉన్నాయని ఇలా షోకి వచ్చి పాలిటిక్స్ చేసే పరిస్థితి లేదని తెలిపారు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడుతో డైరెక్ట్‌గా పవన్ కళ్యాణ్ కాంటాక్ట్‌లో ఉంటున్నారు. వాళ్లు ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటున్నారు.. మొన్న కూడా పవన్ దగ్గరకి చంద్రబాబు నాయుడు వెళ్లారు. ఇద్దరూ కలిసి ప్రెస్ మీట్ పెట్టారు” అని తమ్మారెడ్డి భరద్వాజ చెప్పుకొచ్చారు.