NTR30: `ఆర్ఆర్ఆర్` వంటి పాన్ ఇండియా చిత్రంతో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను కొరటాల శివతో అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై మిక్కిలినేని సుధాకర్, కళ్యాణ్ రామ్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు.
`ఎన్టీఆర్ 30` వర్కింగ్ టైటిల్‌తో త్వరలోనే ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లబోతోంది. అయితే రేపు (మే 20) తారక్ బర్త్‌డే కావడంతో.. ఆయన అభిమానుల కోసం ఎన్టీఆర్ 30 టీమ్ ఒక రోజు ముందే అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది. తాజాగా మేకర్స్ `ఎన్టీఆర్ 30` మూవీకి సంబంధించిన చిన్న వీడియోను విడుదల చేశారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
`అప్పుడప్పుడు ధైర్యానికి కూడా తెలియదు.. అవసరానికి మించి తను ఉండకూడదని.. అప్పుడు భయానికి తెలియాలి.. తను రావాల్సిన సమయం వచ్చిందని.. వస్తున్నా..` అంటూ కత్తి పట్టి ఎన్టీఆర్ చెప్పే డైలాగ్ ఈ వీడియోలో ప్రధాన అకర్షణగా నిలిచింది. ఎన్టీఆర్ లుక్‌ను రివిల్ చేయకపోయినా.. బ్యాక్ గ్రౌండ్ లో సముద్రం, రక్తంతో నిండిన నీరు, పడవలు లాంటి టెరిఫిక్ విజువల్స్ ను చూపించారు.
మొత్తానికి ఆకట్టుకుంటున్న ఈ వీడియో సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. అంతేకాదు, విడుదలైన కాసేపటికే ఈ వీడియె యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. కాగా, పాన్ ఇండియా స్థాయిలో నిర్మితం కానున్న ఈ సినిమాకు అనిరుద్ సంగీతం అందించబోతున్నాడు. సాబు సిరిల్, శ్రీకర్ ప్రసాద్ లాంటి టాలెంటెడ్ టెక్నీషియన్స్ ఈ మూవీ కోసం వర్క్ చేయనున్నారు. అయితే హీరోయిన్ ఎవరన్నది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.