Taraka Ratna-NTR: నందమూరి తారకరత్న గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. `ఒకటో నెంబర్ కుర్రాడు` మూవీతో హీరోగా టాలీవుడ్లోకి వచ్చిన తారకరత్న.. ఈ సినీ కెరీర్లో డజన్‌కు పైగా చిత్రాలు చేశాడు. కానీ, సరైన సక్సెస్ లేకపోవడంతో ఫేడౌట్ హీరోగా మిగిలిపోయాడు. అయితే కొంత కాలం నుంచీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న ఈయన.. మళ్లీ సినీ కెరీర్‌పై దృష్టి సారించారు.
ఇటీవలె `9 అవర్స్` అనే థ్రిల్లర్ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను పలకరించారు. నిరంజన్ కౌశిక్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌కు షో రన్నర్ గా క్రిష్ జాగర్లమూడి వ్యవహరించారు. ఇందులో తారకరత్న ప్రధాన పాత్రను పోషించగా అజయ్, శ్రీ తేజ్, రవి వర్మ, మధు శాలిని, వినోద్ కుమార్, బెనర్జీ, ప్రీతి అస్రాని తదితరులు కీలక పాత్రలను పోషించారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో తెలుగు, హిందీ, కన్నడ, తమిళం, మరాఠీ, మలయాళం, బెంగాలీ భాషల్లో విడుదలైన ఈ సిరీస్ మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా తారకరత్న ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నో విషయాలను షేర్ చేస్తున్నారు. అలాగే గతంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు పోటీగా నందమూరి ఫ్యామిలీ తారకరత్నను దింపారు అన్న ప్రచారం జరిగింది. అయితే ఈ విషయంపై సైతం ఆయన నోరు విప్పారు.
`ఎన్టీఆర్ కి పోటీగా నన్ను దింపినట్టుగా గతంలో చెప్పుకున్నారు. కానీ అది నిజం కాదు. అసలు మా ఫ్యామిలీలో ఎవరూ ఎప్పుడూ అలా భావించలేదు. ఎన్టీఆర్ ముందుకు వెళుతున్నాడంటే, నందమూరి ఫ్యామిలీ ముందుకు వెళుతుందనే అర్థం. మేమందరం ప్రేమాభిమానాలతోనే ఉన్నాము. ఇక నందమూరి ఫ్యామిలీకి సంబంధించిన వాళ్లంతా నన్ను దూరం పెట్టినట్టుగా కూడా ప్రచారం జరుగుతోంది. మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు. అందరూ నన్ను ఎంతో బాగా చూసుకుంటారు` అని తారకరత్న చెప్పుకొచ్చారు. దీంతో ఈయన కామెంట్స్ కాస్త నెట్టింట వైరల్‌గా మారాయి.