29.2 C
Hyderabad
March 21, 2023
NewsOrbit
Entertainment News సినిమా

Balakrishna: బాలకృష్ణ పై ఎమోషనల్ పోస్టు పెట్టిన తారకరత్న భార్య..!!

Share

Balakrishna: నందమూరి తారకరత్న గత నెలలో తుది శ్వాస విడవటం తెలిసిందే. 39 సంవత్సరాల వయసులోనే గుండెపోటు మరణంతో మరణించడం అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. లోకేష్ పాదయాత్ర మొట్టమొదటి రోజు తారకరత్నకి గుండెపోటు రావటం పార్టీలో… నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. అయితే తారకరత్నాన్ని బతికించుకోవటానికి చంద్రబాబు మరియు బాలకృష్ణ కుటుంబ సభ్యులు ఎంతగానో కృషి చేశారు. బెంగళూరులో విదేశీయుల చేత కూడా చికిత్స అందించడం జరిగింది. ఈ క్రమంలో కొన్ని రోజులపాటు చావుతో పోరాడిన తారకరత్న చివరాఖరికి తుది శ్వాస విడిచారు. తారకరత్న కి ముగ్గురు పిల్లలు ఉండటం తెలిసిందే.

Tarakaratna's wife posted an emotional post on Balakrishna

అయితే ఆ పిల్లలు చిన్న వయసు కావటంతో తండ్రిని కోల్పోవడంతో… వాళ్ల పరిస్థితి చూసి చాలా మందికి జాలేసింది. అయితే నందమూరి తారకరత్న పిల్లల విషయంలో మొత్తం బాధ్యత తానే తీసుకుంటున్నట్లు బాలకృష్ణ తెలియజేశారు. ఇదే సమయంలో తారకరత్న భార్య అలేఖ్య రెడ్డికి అన్ని రకాలుగా తాను తోడుగా ఉంటానని… కుటుంబ పెద్దగా.. భరోసా ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ క్రమంలో నందమూరి తారకరత్న పెద్దకర్మ అన్ని విషయాలు కూడా బాలకృష్ణ దగ్గరుండి చూసుకున్నారు.

Tarakaratna's wife posted an emotional post on Balakrishna

ఇదిలా ఉంటే ఇటీవల తారకరత్న ముగ్గురు పిల్లలతో ఉన్న ఫోటోలో బాలకృష్ణ ఫోటోని మార్ఫింగ్ చేసి.. జతచేసి సోషల్ మీడియాలో ఒకరు పోస్ట్ చేశారు. ఆ ఫోటోని నందమూరి తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి షేర్ చేసి.. బాలయ్య పై ఎమోషనల్ పోస్టు పెట్టడం జరిగింది. “ఎవరినైతే మేము కుటుంబం అని చెప్పగలమో… ఎవరైతే మాకు ఇబ్బంది కలిగినప్పుడు… సంతోషం కలిగినప్పుడు… మా వెంటే ఉంటూ… మాకు అండగా నిలబడి మమ్మల్ని కాపాడుతున్నారో… ఆయనే బాలకృష్ణ. ఈ ఫోటో మార్ఫింగ్ చేసిన వారికి థాంక్యూ అని అలేఖ్య రెడ్డి పోస్ట్ పెట్టడం జరిగింది.


Share

Related posts

HBD Manisharma: మణిశర్మ బర్త్ డే స్పెషల్ నారప్ప సినిమా ఫస్ట్ సాంగ్ విడుదల..!!

bharani jella

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో మొత్తం ఎన్ని రీమేక్ సినిమాలు చేశారో తెలుసా..??

sekhar

అడవి శేష్ మేజర్ నుంచి వెళ్ళిపోయిన శోభిత ధూళిపాల్ల ..!

GRK